📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Latest Telugu News: Inida Post: GenZ పోస్ట్ ఆఫీస్ కొత్త అవతారం!

Author Icon By Vanipushpa
Updated: December 9, 2025 • 3:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకప్పుడు ఉత్తరాలు, పోస్ట్‌కార్డులు మన భావోద్వేగాలను మోసుకెళ్లేవి. ప్రియమైన వారి చేతిరాత చూడగానే కలిగే ఆనందం వర్ణణాతీతం. కానీ నేటి డిజిటల్ యుగంలో.. ఇన్‌స్టంట్ మెసేజింగ్ ముందు ఆ పాత పద్ధతులు కనుమరుగయ్యాయి. ముఖ్యంగా నేటి యువతరం (Gen Z)కి పోస్ట్ కార్డు అంటే తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో.. ఆ పాత అనుబంధాన్ని తిరిగి తీసుకురావడానికి ‘ఇండియా పోస్ట్’ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే – Gen Z post office కాన్సెప్ట్. భారతదేశ వ్యాప్తంగా విద్యాసంస్థల్లోని 46 పోస్ట్ ఆఫీసులను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా.. ఆంధ్ర యూనివర్సిటీ (AU) సౌత్ క్యాంపస్‌లో ఒక ప్రత్యేకమైన Gen Z post office దాదాపుగా సిద్ధమైంది. ఇప్పటికే IIT-ఢిల్లీ, IIT-గాంధీనగర్‌లలో ఇలాంటి నమూనాలను ఏర్పాటు చేశారు.

Read Also: Accident: కొత్త జంట ప్రాణం తీసిన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్

Inida Post

పోస్టల్ సేవలు, కొత్త పథకాలు

కాన్సెప్ట్ ఇదే.. విశాఖపట్నం రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ VS జయశంకర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కొత్త పోస్ట్ ఆఫీస్ యొక్క ముఖ్య ఉద్దేశం.. యువత ఆకర్షణ: సాంప్రదాయ పోస్ట్ ఆఫీస్‌ను యువతరం ఇష్టపడే విధంగా టెక్నాలజీ ఆధారిత హ్యాంగ్‌అవుట్ జోన్‌గా మార్చడం. సేవల విస్తరణ: పోస్టల్ సేవలు, కొత్త పథకాలు, కమ్యూనికేషన్ పద్ధతుల గురించి విద్యార్థులకు సులభంగా సమాచారం అందించడం. ట్రస్ట్ & లెగసీ: ఇండియా పోస్ట్ యొక్క విశ్వసనీయతను, వారసత్వాన్ని అలాగే కొనసాగిస్తూనే.. వాతావరణాన్ని మార్చడం. వైఫై, కేఫ్‌లు కూడా ఈ కొత్త డిజైన్‌తో కూడిన Gen Z post office కేవలం ఉత్తరాలు పంపే ప్రదేశంగా మాత్రమే ఉండదు. విద్యార్థులు ఇక్కడ సేదతీరడానికి, కలుసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కెఫెటేరియా (Cafeteria): కాఫీ తాగుతూ, స్నేహితులతో మాట్లాడేందుకు సౌకర్యం. టెక్నాలజీ-ఎనేబుల్డ్ జోన్‌గా మార్చడానికి వై-ఫై సదుపాయం. రాష్ట్రమంతటా.. విశాఖపట్నం, గుంటూరు, కర్నూలులలో కూడా త్వరలో ఇలాంటి ఆధునీకరించిన పోస్ట్ ఆఫీస్‌లను తెరవనున్నట్లు పోస్ట్‌మాస్టర్ జనరల్ జయశంకర్ తెలిపారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Digital Postal Services GenZ Post Office Google News in Telugu India Post Modernization Latest In telugu news Postal Innovation Technology Upgrade Telugu News Today Youth Engagement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.