📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

IMF: ఐఎంఎఫ్ నుంచి వైదొలగనున్న గీతా గోపీనాథ్

Author Icon By Ramya
Updated: July 22, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి గీతా ఆగస్టు మాసంలో వైదొలగుతారని ఐఎంఎఫ్ ప్రకటించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న గీతా గోపీనాథ్ (Geeta Gopinath) ఆగస్టులో తన పదవి నుంచి వైదొలగనున్నారు. ఈ మేరకు ఐఎంఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. తొలి మహిళగా చరిత్ర సృష్టించారు గీతా గోపీనాథ్ 2019లో ఐఎంఎఫ్ చీఫ్ఎ కానమిస్ట్ నియమితులయ్యారు. ఆ పదవిని చేపట్టిన తొలిమహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలక విధానాలు రూపొందించడంలో ఆమె కీలకపాత్ర పోషించారు. 2022లో ఐఎంఎఫ్ (IMF) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (Deputy Managing Director) హోదాలోకి ప్రమోట్ కావడంతో మరో మైలురాయిని సాధించారు. గ్లోబల్ పాండమిక్, ఆర్థిక మాంద్యం వంటి క్లిష్టపరిస్థితుల్లో ఐఎంఎఫ్ (IMF) కు మార్గదర్శకత్వం ఇచ్చారు. కరోనాతో పలు దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి.

IMF: ఐఎంఎఫ్ నుంచి వైదొలగనున్న గీతా గోపీనాథ్

ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో చాకచక్యంగా వ్యవహరించిన నేత

ఉపాధిలేక అనేకులు ఆర్థిక ఇబ్బందుల గుండా పయనించారు. చిన్నదేశాలు, పర్యాటకపై ఆధారపడ్డ దేశాలు అయితే కోలుకోలేని దెబ్బతగిలింది. అయితే ఈ పరిస్థితుల్లో గీతా తన చాకచక్యతను చాటి, ఆ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నారు. ఈ సీజన్లో ఆమె తీసుకున్న నేటికి ఆదర్శప్రాయంగా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ప్రొఫెసర్గా కొనసాగనున్న గీతా గోపీనాథ్ గీత గోపీనాథ్ పదవి నుంచి వైదొలగిన తర్వాత తిరిగి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరనున్నారు. ఆమె తర్వాత ఆ పదవి చేపట్టే వ్యక్తి పేరును త్వరలోనే ప్రకటిస్తామని ఐఎంఎఫ్ (IMF) చీఫ్ క్రిస్టాలిన్ జార్జివా తెలిపారు. ఐఎంఎఫ్ ఆమె చూపిన నైపుణ్యం, నాయకత్వం ప్రపంచ ఆర్థిక రంగంలో చిరస్మరణీయంగా నిలిచే అవకాశముంది. అంతేకాదు అకడమిక్ రంగంలోనే గణనీయమైన సేవలు అందించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అంకితభావంతో పనిచేసే గీతాగోపీనాథ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తుంది అనడంలో అనుమానం లేదు.

గీతా గోపీనాథ్ ఎవరు?

జనవరి 21, 2022 నాటికి గీతా గోపీనాథ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) యొక్క మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్.

గీతా గోపీనాథ్ దేనికి ప్రసిద్ధి?

గీతా గోపీనాథ్ (జననం 8 డిసెంబర్ 1971) ఒక భారతీయ-అమెరికన్ ఆర్థికవేత్త, ఆమె 21 జనవరి 2022 నుండి అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) యొక్క మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు . ఆమె గతంలో 2019 మరియు 2022 మధ్య IMF యొక్క ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేశారు.

Imf ఎండీ ఎవరు?

ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్‌పర్సన్ బల్గేరియన్ ఆర్థికవేత్త క్రిస్టాలినా జార్జివా , ఆమె 1 అక్టోబర్ 2019 నుండి ఈ పదవిలో ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Achuthanandan: కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌ కన్నుమూత

Breaking News economic policy Geeta Gopinath Global Economy IMF latest news Telugu News Women Leaders

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.