Maldives: మాల్దీవులలో స్పీడ్‌బోట్ ప్రమాదంలో గౌతమ్ సింఘానియాకు గాయాలు, ఇద్దరు గల్లంతు

Read Time:  1 min
మాల్దీవులలో స్పీడ్‌బోట్ ప్రమాదంలో గౌతమ్ సింఘానియాకు గాయాలు, ఇద్దరు గల్లంతు
మాల్దీవులలో స్పీడ్‌బోట్ ప్రమాదంలో గౌతమ్ సింఘానియాకు గాయాలు, ఇద్దరు గల్లంతు
FONT SIZE
GET APP

స్థానిక మీడియా నివేదికల ప్రకారం, మాల్దీవులలోని ఫెలిధూ ద్వీపం సమీపంలో ఒక స్పీడ్‌బోట్ బోల్తా పడటంతో రేమండ్ గ్రూప్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ హరి సింఘానియా(Gautam Hari Singhania) గాయపడగా, ఇద్దరు భారతీయులు గల్లంతయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున వావు అటాల్ సమీపంలో జరిగిన ఈ ఘటన సమయంలో బోటులో ఏడుగురు ఉన్నారు. వారిలో ఒక బ్రిటిష్ జాతీయురాలు, ఒక రష్యన్ జాతీయురాలు ఉండగా, ఐదుగురు భారతీయ పురుషులు ఉన్నారని Edition.mv నివేదించింది.

Read Also: Madhumita Raut: ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత

Gautam Singhania injured, two missing in speedboat accident in Maldives
Maldives: Gautam Singhania injured, two missing in speedboat accident in Maldives

గల్లంతైన ఇద్దరూ భారత జాతీయుల కోసం గాలింపు చర్యలు

పడవ బోల్తా పడటంతో, రష్యన్ మహిళ, నలుగురు భారతీయ పురుషులతో సహా ఐదుగురు సముద్రంలో పడిపోయారని పోలీసులు తెలిపారు. పర్యాటకులలో ఒకరైన 60 ఏళ్ల సింఘానియాను రక్షించారు. ఈ ప్రమాదంలో అతనికి స్వల్ప గాయాలయ్యాయని, చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని పోలీసులను ఉటంకిస్తూ అధాధు న్యూస్ పోర్టల్ నివేదించింది. “గల్లంతైన ఇద్దరూ భారత జాతీయులే” అని పోలీసులు తెలిపారు, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కూడా పేర్కొన్నారు. “ఆ స్పీడ్‌బోట్ అతని యాచ్, టీటీ అషేనాకు చెందినది. ఈ ప్రమాదంలో గల్లంతైన ఇద్దరి కోసం మాల్దీవియన్ కోస్ట్ గార్డ్ ఇంకా గాలిస్తోంది,” అని అధాధు నివేదించింది. ప్రమాదానికి గురైన పడవ, అధిక వేగంతో నడపడానికి రూపొందించిన సిగరెట్ రేసింగ్ బోట్ అని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అది పేర్కొంది. మాల్దీవ్స్ జాతీయ రక్షణ దళానికి చెందిన మాలే ఏరియా కమాండ్ కోస్ట్ గార్డ్ సెకండ్ స్క్వాడ్రన్ గల్లంతైన వ్యక్తుల కోసం గాలిస్తోంది. కీయోధూకు నైరుతి దిశలో సుమారు రెండు నాటికల్ మైళ్ల దూరంలో ఈ సంఘటన జరిగిందని MNDF తెలిపింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.