📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News : Gautam Singhania : ఎలక్ట్రానిక్‌ వాహనాలను రాజకీయంగా ప్రమోట్‌ చేస్తున్నారు..! గౌతమ్‌

Author Icon By Sudha
Updated: October 18, 2025 • 4:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎలక్ట్రానిక్‌ వాహనాలపై రేమండ్‌ గ్రూప్‌ చైర్మన్‌, భారత తొలి సూపర్‌ కార్‌ క్లబ్‌ వ్యవస్థాపకుడు గౌతమ్‌ హరి సింఘానియా (Gautam Singhania) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్‌ వాహనాలను రాజకీయంగా ప్రమోట్‌ చేస్తున్నారని.. వాటిని బొమ్మల్లాగే చూడాలంటూ వ్యాఖ్యానించారు. ఓ మీడియా గ్రూప్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను ఈవీ వాహనాలను నడపడం ఇష్టమా? అని ప్రశ్నించగా.. ఆయన నిర్మొహమాటంగా స్పందిస్తూ.. తాను వాటి గురించి ఆలోచించని స్పష్టం చేశారు. ఈవీ కార్లను బొమ్మలతో పోల్చిన ఆయన.. తనకు నాలుగు సంవత్సరాల వయసులో తన దగ్గర బ్యాటరీ నడిచే కారు ఉండేదని.. ఇప్పుడు ఈవీల గురించి ఎందుకు గొడవ? అప్పటి నా కారు కూడా ఈవీయే అని వ్యాఖ్యనించారు. మోటార్ స్పోర్ట్స్ గురించి మాట్లాడుతూ.. భారత్‌లో ఈ క్రీడను ప్రోత్సహించడానికి పూర్తి పర్యావరణ వ్యవస్థ అవసరమన్నారు. ఇక్కడ మోటార్‌ స్పోర్ట్స్‌ సాధన చేయడం లేదన్నారు. ఇక్కడ క్రికెట్‌ను గల్లీలో ఆడుతారని.. ఇది జీవన శైలిలో భాగమన్నారు. తన కూతురు బెల్జియంలో రైడ్‌ చేస్తుందని.. ఎందుకంటే ఎక్కడ ఓ వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. తాను యూకేలో ఉంటే ప్రతిరోజూ రేసింగ్‌ చేయగలనన్నారు. సూపర్ కార్లపై తనకున్న మక్కువ గురించి మాట్లాడుతూ.. అలాంటి కార్లను నిర్మించడం అంత సులభం కాదన్నారు. సూపర్ కార్లను తయారు చేసే బ్రాండ్లు చాలా తక్కువ అన్నారు. కారును డెలివరీ చేయడానికి రెండు నుంచి మూడేళ్లు పడుతుందన్నారు. తాను కారును ఉదయం 7 గంటలకు నడుపుతానని.. అప్పుడే నిజమైన ఆనందం ఉంటుందన్నారు.

Read Also: Belgium: ఎట్టకేలకు మెహుల్ ఛోక్సీని అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్

Gautam Singhania

రక్షణ, అంతరిక్ష రంగాలపై మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొత్త సాంకేతిక పరిజ్ఞానాలకు అవకాశాలను సృష్టించిందని పేర్కొన్నారు. ఈ దిశలో అనేక ప్రాజెక్టులపై పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఎందుకంటే అక్కడి వాతావరణం చాలా అనిశ్చితంగా ఉందని.. భారత్‌లో మధ్యతరగతి, వారి ఆకాంక్షలు పెరుగుతున్న కొద్దీ, ప్రజలు సరసమైన లగ్జరీని కోరుకుంటున్నారన్నారు. భారతదేశం ఏరోస్పేస్, రక్షణ తయారీకి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. తాము యూఎస్‌లో పని చేయకూడదని నిర్ణయించుకున్నామని.. ఎందుకంటే తమకు అనిశ్చితి ఇష్టం లేదన్నారు. చివరగా రేమండ్‌ను లగ్జరీ బ్రాండ్ అని పిలువచ్చా? అని సింఘానియాను (Gautam Singhania) ప్రశ్నించగా.. తిరస్కరించారు. తాము మార్కెట్‌ మధ్యలోనే ఉన్నామని.. లగ్జరీ మాత్రం కాదన్నారు.

గౌతమ్ సింఘానియా బిజినెస్ నేమ్?

అతని నాయకత్వంలో, రేమండ్ గ్రూప్ “రేమండ్ 2.0” అని పిలువబడే వ్యూహాత్మక పునర్నిర్మాణానికి గురైంది, ఇందులో మూడు విభిన్న లిస్టెడ్ కంపెనీలను సృష్టించడానికి విలీనాలు ఉన్నాయి: రేమండ్ లిమిటెడ్ (ఇంజనీరింగ్), రేమండ్ లైఫ్ స్టైల్ మరియు రేమండ్ రియాల్టీ.

సింఘానియా కుటుంబ వివాదం ఏమిటి?

ఫిబ్రవరి 2015లో, మధుపతి సింఘానియా నలుగురు పిల్లలు బాంబే హైకోర్టులో సింఘానియాపై దావా వేశారు, వారి తల్లిదండ్రులకు మరియు అతనికి మధ్య 1998 ఒప్పందం వారి హక్కులను పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపిస్తూ . వారు ఒప్పందాన్ని రద్దు చేయాలని మరియు రేమండ్‌తో సహా వదులుకున్న హోల్డింగ్‌లలో వారి వాటాను తిరిగి నిర్ధారించాలని కోరుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

auto industry Breaking News Electric Vehicles EV controversy Gautam Singhania latest news political promotion Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.