हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Latest Telugu News : Gaurav Gogoi: టోల్ గేట్లు ఉన్నప్పటికీ రోడ్ల నాణ్యత చాలా తక్కువ.. ఎంపీ గౌరవ్ గొగోయ్

Sudha
Latest Telugu News : Gaurav Gogoi: టోల్ గేట్లు ఉన్నప్పటికీ రోడ్ల నాణ్యత చాలా తక్కువ.. ఎంపీ గౌరవ్ గొగోయ్

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రయాణించిన కారు 130 కిలోమీటర్ల వేగంతో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వేపై ప్రయాణించింది. వైరల్‌ అయిన ఈ వీడియో క్లిప్‌ను కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) ప్రస్తావించారు. అస్సాంలో అలాంటి నాణ్యమైన రోడ్లు లేకపోవడంతో అంత వేగంతో తాము డ్రైవ్ చేయలేమని అన్నారు. గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తన రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిని ఎంపీ గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) ప్రస్తావించారు. ‘సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. మీ కారు హైవేపై వేగంగా వెళ్తున్నట్లు చూపించింది. అస్సాంలో అలాంటి రోడ్లు లేకపోవడంపై మేం అసూయపడుతున్నాం. టోల్ గేట్లు ఉన్నప్పటికీ రోడ్ల నాణ్యత చాలా తక్కువగా ఉన్నది. అందుకే మేం 100-130 కిలోమీటర్ల వేగంతో కారు నడపలేం’ అని అన్నారు.

Read Also : http://West Bengal: బాబ్రీ తరహా మసీదు కడతానన్నా ఎమ్మెల్యే పార్టీ నుంచి సస్పెండ్

Gaurav Gogoi
Gaurav Gogoi

కాగా, అస్సాం ప్రజలు టోల్‌ ట్యాక్స్‌ చెల్లిస్తున్నప్పటికీ ఆ వీడియోలో ఉన్నట్లుగా మంచి నాణ్యత గల హైవేలు పొందలేకపోతున్నారని ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. ముఖ్యంగా జోర్హాట్ నుంచి దిబ్రూగఢ్‌ వరకు ఎన్‌హెచ్‌-37 పరిస్థితి దారుణంగా ఉన్నదని విమర్శించారు. ‘మీ జోక్యం తర్వాత ఝాన్జీ భాగం ఇప్పుడు మెరుగ్గా ఉన్నది. ఆ తర్వాత రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి’ అని అన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ దీనిపై స్పందించారు. భారీ వర్షాల కారణంగా హైవే దెబ్బతిన్నదని అంగీకరించారు. ‘ఎంపీ చెప్పింది నిజమే. వర్షం తర్వాత రోడ్డు దెబ్బతిన్నది. దీనిపై విచారణ కూడా నిర్వహించి పరిస్థితిని సరిదిద్దారు. రోడ్డు బాగానే ఉంటుందని నేను నమ్ముతున్నా’ అని సభకు తెలిపారు. అయితే అతి వేగం వల్ల ప్రమాదాలు జరుగుతుండగా, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి అయిన నితిన్‌ గడ్కరీ తన కారులో అంత వేగంగా జాతీయ రహదారిపై ప్రయాణించడంపై విమర్శలు కూడా వచ్చాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870