📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Gaurav Gogoi: మ‌తం ఆధారంగా ప్ర‌జ‌ల్ని ఎవ‌రూ టార్గెట్ చేయ‌వ‌ద్దు ..ఎంపీ గౌర‌వ్ గ‌గోయ్

Author Icon By Sudha
Updated: July 28, 2025 • 4:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన భారత త్రివిధ దళాల సాహసం, ఉగ్రవాదంపై కట్టుదిట్టమైన వైఖరిని వివరించారు. అయితే, ఈ ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ (Gaurav Gogoi) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) గారు పలు అంశాలపై వివరాలు ఇచ్చారు, కానీ పహల్గాం దాడికి ఉగ్రవాదులు ఎలా వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరూ సహకరించారు? అనే అంశాలపై మౌనం వహించారు,” అని విమర్శించారు.

Gaurav Gogoi: మ‌తం ఆధారంగా ప్ర‌జ‌ల్ని ఎవ‌రూ టార్గెట్ చేయ‌వ‌ద్దు ..ఎంపీ గౌర‌వ్ గ‌గోయ్

ఎందుకు ప‌ట్టుకోలేదు

పెహల్గామ్ ఘ‌ట‌న‌ను ఇన్‌ఫ‌ర్మేష‌న్ వార్ అని పేర్కొన్నారు. మ‌తం ఆధారంగా ప్ర‌జ‌ల్ని టార్గెట్ చేయ‌వ‌ద్దు అని గ‌గోయ్ (Gaurav Gogoi) ఆన్నారు. ఎలా ఆ అయిదుగురు ఉగ్ర‌వాదులు పాకిస్థాన్ నుంచి ఇండియాకు ఎంట‌ర్ అయ్యార‌ని, వాళ్ల ఉద్దేశం ఏంట‌ని ఆయ‌న అడిగారు. పెహ‌ల్గామ్‌లో దాడికి పాల్ప‌డిన అయిదుగురు ఉగ్ర‌వాదుల‌ను ఎందుకు ప‌ట్టుకోలేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. వంద రోజులు దాటినా వాళ్ల‌ను ఎందుకు బంధించ‌లేద‌న్నారు. ప్ర‌భుత్వం వ‌ద్ద దానిపై స‌మాధానం లేద‌న్నారు. మీవ‌ద్ద డ్రోన్లు, పెగాస‌స్, శాటిలైట్లు ఉన్నాయ‌ని, కానీ ఆ ఉగ్ర‌వాదుల‌ను మీరు ప‌ట్టుకోలేక‌పోయార‌ని కాంగ్రెస్ నేత అన్నారు. ఆర్టిక‌ల్ 370ని రద్దు చేశార‌ని, క‌శ్మీర్ లోయ‌కు ప‌ర్యాట‌కుల‌ను ఆహ్వానించారు, కానీ పెహ‌ల్గామ్ అటాక్ స‌మ‌యంలో వాళ్లు నిస్స‌హాయులుగా ఉండిపోయిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. పెహల్గామ్ ఉగ్ర‌దాడికి కేంద్ర మంత్రి అమిత్ షా బాధ్య‌త వ‌హించాల‌న్నారు. దీనికి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌ను బ‌లి చేయ‌రాదు అని అన్నారు.

Gaurav Gogoi: మ‌తం ఆధారంగా ప్ర‌జ‌ల్ని ఎవ‌రూ టార్గెట్ చేయ‌వ‌ద్దు ..ఎంపీ గౌర‌వ్ గ‌గోయ్

అంత‌ర్జాతీయ దౌత్యం

ప్ర‌స్తుత ప్ర‌భుత్వ హ‌యాంలో అత్యంత భ‌యంక‌ర‌మైన దాడి జ‌రిగింద‌ని గ‌గోయ్ (Gaurav Gogoi) ఆరోపించారు. ర‌ఫేల్ యుద్ధ విమానాల కోల్పోయిన అంశంపై త్రివిధ ద‌ళాధిప‌తి అనిల్ చౌహాన్ ఓ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ అంశాన్ని ఆయ‌న గుర్తు చేశారు. పాకిస్థాన్‌, భార‌త్ మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ త‌న వ‌ల్లే జ‌రిగింద‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఇప్ప‌టి వ‌ర‌కు 26 సార్లు వెల్లడించార‌ని, దీనిపై నిజం ఏంటో చెప్పాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి, సిందూర్ ఆప‌రేష‌న్ త‌ర్వాత జ‌రిగిన అంత‌ర్జాతీయ దౌత్యం గురించి వెల్ల‌డించాల‌ని గ‌గోయ్ అడిగారు. పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ రుణం అంద‌కుండా ఇండియా ఎందుకు అడ్డుకోలేద‌న్నారు. పాకిస్థాన్‌తో ఎందుకు కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీక‌రించారో ప్ర‌ధాని మోదీ చెప్పాల‌ని గ‌గోయ్ డిమాండ్ చేశారు.

గౌరవ్ గొగోయ్ ఏ రాష్ట్రానికి చెందినవాడు?

గౌరవ్ గొగోయ్ (జననం 4 సెప్టెంబర్ 1982) అస్సాం నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు సామాజిక కార్యకర్త, అతను 2024 నుండి లోక్‌సభలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన 2024 నుండి 18వ లోక్‌సభలో జోర్హాట్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గౌరవ్ గొగోయ్ రాజకీయ జీవితం?

గౌరవ్ గొగోయ్ 2014లో తన తండ్రి తరుణ్ గొగోయ్ అడుగుజాడల్లో కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కలియబోర్ నుండి పోటీ చేసి తొలిసారి లోకసభా సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2019, 2024లో లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాడు. గౌరవ్ 2020 నుండి 2024 వరకు లోక్‌సభలో భారత జాతీయ కాంగ్రెస్‌కు ఉప నాయకుడిగా పనిచేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Pahalgam: పహల్గామ్‌‌ ఉగ్రవాదులను హతమార్చిన

Breaking News Gaurav Gogoi Indian Parliament latest news Operation Sindoor Rajnath Singh religion-based targeting Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.