📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Gas Price Hike: గ్యాస్ ధరల పెంపు.. కేంద్రంపై ఖర్గే విమర్శలు

Author Icon By Anusha
Updated: March 7, 2026 • 3:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gas Price Hike: దేశంలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు తోడు, గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. డొమెస్టిక్‌పై ₹60, కమర్షియల్ సిలిండర్‌పై ₹115 పెంచడం సామాన్యులకు భారమేనని మండిపడ్డారు. అంతర్జాతీయంగా రేట్లు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు ఇవ్వకుండా ఇప్పుడు ద్రవ్యోల్బణంతో పీడిస్తున్నారని విమర్శించారు. దేశంలో గ్యాస్, ఎరువుల కొరతను తీర్చలేని మోదీ ప్రభుత్వం అన్నీ బాగున్నాయంటూ ప్రగల్భాలు పలుకుతోందని X వేదికగా ఎద్దేవా చేశారు.

Read Also: The Kerala Story 2: ‘ది కేరళ స్టోరీ 2’ పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

పెరిగిన గ్యాస్ ధరలు వివరాలు ఇలా!

దేశవ్యాప్తంగా 14.2 కిలోల గృహోపకరణాల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. అదేవిధంగా 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర కూడా రూ.115 పెరిగింది. దీని ప్రభావం హోటళ్ళు, రెస్టారెంట్లు, చిన్న వాణిజ్య సంస్థలపై పడబోతోంది. పెరిగిన గ్యాస్ సిలెండర్ ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తున్నాయి. ఢిల్లీలో 14.2 కిలోల గృహోపకరణాల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.853 నుండి రూ.913 కు పెరిగింది.

ముంబైలో కొత్త రేటు ఇప్పుడు రూ.852.50గా ఉంది. కోల్‌కతాలో ధర రూ.879 నుండి రూ.030 కు పెరిగింది. చెన్నైలో ఇది రూ.868.50 నుండి రూ.928.50 కు పెరిగింది.మరోవైపు ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1768.50 నుండి రూ.1883కి పెరిగింది. ముంబైలో కమర్షియల్ సిలెండర్ ధర రూ.1720.50 నుండి రూ.1835కి పెరిగింది. అలాగే కోల్‌కతాలో ధర రూ.1875.50 నుండి రూ.1990కి పెరిగింది, చెన్నైలో ఇది రూ.1929 నుండి రూ.2043.50కి పెరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Domestic Gas Cylinder Price 2026 Gas Price Hike Mallikarjun Kharge Modi Govt

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.