Gas Cylinder: కేంద్ర ప్రభుత్వం పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వాడుతున్న వినియోగదారుల కోసం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇంట్లో నేరుగా పైపులైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు, అదనంగా ఎల్పీజీ (LPG) సిలిండర్లను కలిగి ఉండటంపై ఆంక్షలు విధించింది. పీఎన్‌జీ సౌకర్యం ఉన్న గృహాలకు ఇకపై డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని చమురు సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.
Read Also:Assembly Election 2026: నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
వెంటనే సిలిండర్ కనెక్షన్లు సరెండర్ చేయాలని ఆదేశం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఒకే ఇంట్లో పీఎన్‌జీ మరియు ఎల్పీజీ కనెక్షన్లు రెండూ ఉండటం నిబంధనలకు విరుద్ధం. పీఎన్‌జీ వాడుతున్న వారు తమ వద్ద ఉన్న ఎల్పీజీ కనెక్షన్‌ను వెంటనే సరెండర్ చేయాలని ప్రభుత్వం కోరింది. అలాగే, ఇప్పటికే పైపులైన్ గ్యాస్ వాడుతున్న వారికి కొత్తగా ఎల్పీజీ కనెక్షన్లు మంజూరు చేయవద్దని గ్యాస్ ఏజెన్సీలను ఆదేశించింది. ఇంధన వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పీఎన్‌జీ వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కడప వంటి నగరాల్లో వేలాది కుటుంబాలు పైపులైన్ గ్యాస్‌ను ఉపయోగిస్తున్నాయి. ఈ నగరాల్లోని వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్ల విషయంలో జాగ్రత్త వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: