📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి

Gadchiroli: గడ్చిరోలి పై అర్బన్ నక్సల్స్ దుష్ప్రచారం

Author Icon By Ramya
Updated: July 23, 2025 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్

గడ్చిరోలి: విదేశీ నిధులతో గడ్చిరౌలిపై (Gadchiroli) అర్బన్ నక్సల్స్ దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం చేస్తున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. లాయిడ్స్ అండ్ ఎనర్జీ లిమిడెట్ సంస్థ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. గడ్చిరోలిలో నక్సలిజం తగ్గుతోందని, ప్రస్తుతం కొంతమంది నక్సలైట్లు (Naxalites) మాత్రమే ఉన్నారని, వాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు అని, ఇక్కడి అడువుల్లో వాళ్లు ఉన్నారని ఆయన అన్నారు. హింసను వీడాలని నక్సలైట్లకు విజప్తి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలిపారు. ప్రధాన జీవనస్రవంతిలో కలవాలని కోరుతున్నట్లు తెలిపారు.

Gadchiroli: గడ్చిరోలి పై అర్బన్ నక్సల్స్ దుష్ప్రచారం

నక్సలైట్స్ తగ్గుదల మధ్య అర్బన్ నక్సల్స్ పెరుగుదల

అయితే తుపాకీ పట్టుకుని తిరిగే నక్సలైట్లు తగ్గుతున్న దశలో.. అర్బన్ నక్సల్స్ సంఖ్య పెరుగుతోందని సిఎం ఫడ్నవీస్ (CM Fadnavis) పేర్కొన్నారు. అర్బన్ నక్సల్స్ పట్ల అలర్ట్ ఉండాలని, వాళ్లు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారని, గడ్చిరోలిలో స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపన చేయగా, మరుసటి రోజే సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలుపెట్టారని, గిరిజనులను చంపుతున్నారని ప్రచారం చేస్తున్నట్లు సిఎం ఆరోపించారు. భారీ స్థాయిలో అడవుల్ని నరికివేస్తున్నట్లు ప్రచారంచేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేస్తుంటే.. ఎలా వ్యతిరేక ప్రచారం చేపడుతున్నారని ఆయన అడిగారు. మహారాష్ట్రకు సంబంధం లేని వ్యక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, ఇద్దరు కోల్కతాలో ఉన్నారని, మరో ఇద్దరు బెంగళూరులో ఉన్నారని, వాళ్లు విదేశీ నిధులతో.. సోషల్ మీడియా పోస్టులతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని సిఎం ఫడ్నవీస్ పేర్కొ న్నారు. అబద్ధాలు చెబుతూ అర్బన్ నక్సల్స్ గడ్చిరౌలిని అభివృద్ధికి దూరం చేస్తున్నారని ఆయన తెలిపారు.

గడ్చిరోలి వాతావరణం?

భారత ద్వీపకల్పం మధ్యలో, బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రం నుండి దూరంగా ఉన్న గడ్చిరోలి ఉష్ణమండల తడి మరియు పొడి వాతావరణాన్ని కలిగి ఉంటుంది, సంవత్సరంలో ఎక్కువ భాగం పొడి పరిస్థితులు ఉంటాయి . బేరార్. ఇది దాదాపు 1,000 మిమీ (39 అంగుళాలు) వార్షిక వర్షపాతం పొందుతుంది, దాదాపు పూర్తిగా జూన్ మరియు సెప్టెంబర్ మధ్య రుతుపవనాల వర్షాల ద్వారా వస్తుంది.

గడ్చిరోలి దేనికి ప్రసిద్ధి?

ఈ జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 76% అడవులతో నిండి ఉంది. ఈ జిల్లా వెదురు మరియు టెండు ఆకులకు ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లాలో వరి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తి. జిల్లాలోని ఇతర వ్యవసాయ ఉత్పత్తులు జ్వార్, లిన్సీడ్, టూర్, గోధుమలు.

గడ్చిరోలి జిల్లాలోని ఏ గిరిజనులు తమ దేవుని ఆరాధన కోసం ఉపయోగిస్తారు?

జిల్లాలో నివసించే గిరిజనులలో ప్రధానమైనవి గోండ్, మాడియా, పర్ధాన్ మరియు కోలం. వారికి “గోండి, మాడియా” వంటి సొంత భాషలు ఉన్నాయి. జిల్లాలోని గిరిజనులకు వారి స్వంత సంస్కృతి ఉంది. వారు తమ దేవుడు ” పెర్సా పెన్ ” మరియు ఇతరులను ఆరాధించడానికి అలవాటు పడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Pakistan flights ban : ఆగస్టు 23 వరకు పాకిస్థాన్ విమానాల‌పై నిషేధాన్ని పొడిగించిన భార‌త్‌

Breaking News CM Fadnavis false propaganda Gadchiroli latest news Telugu News Tribal Development Urban Naxals

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.