📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు

FSSAI: దేశంలో విక్రయించే కోడిగుడ్లు పూర్తిగా సురక్షితం

Author Icon By Tejaswini Y
Updated: December 20, 2025 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Egg safety: కోడిగుడ్లలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) స్పష్టమైన వివరణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న కోడిగుడ్లు మానవ వినియోగానికి పూర్తిగా భద్రమైనవేనని సంస్థ స్పష్టం చేసింది. గుడ్ల నాణ్యతపై వస్తున్న ఆరోపణలు శాస్త్రీయ ఆధారాలు లేనివని, ప్రజల్లో అనవసర భయాన్ని కలిగించేలా ఉన్నాయని పేర్కొంది.

Read also: Anand Varadarajan: స్టార్‌బక్స్‌ CTOగా ఆనంద్‌ వరదరాజన్‌

నైట్రోఫ్యూరాన్ ఆరోపణలపై FSSAI క్లారిటీ

ఇటీవలి కాలంలో కొన్ని మీడియా కథనాలు, సోషల్ మీడియా వేదికలపై కోడిగుడ్లలో నైట్రోఫ్యూరాన్ జీవక్రియా అవశేషాలు (AOZ) ఉన్నాయనే వాదనలు వినిపించాయి. దీనిపై స్పందించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ, 2011 ఆహార భద్రతా నిబంధనల ప్రకారం కోళ్ల పెంపకం, గుడ్ల ఉత్పత్తిలో నైట్రోఫ్యూరాన్‌ల వినియోగం పూర్తిగా నిషేధించబడిందని గుర్తు చేసింది.

FSSAI: Chicken eggs sold in the country are completely safe

పర్యవేక్షణ, పరీక్షల కోసమే నైట్రోఫ్యూరాన్‌(Nitrofuran)కు కిలోకు 1 మైక్రోగ్రామ్ పరిమితిని (EMRL) నిర్ణయించామని, ఇది ప్రయోగశాలల్లో గుర్తించగల అతి తక్కువ స్థాయి మాత్రమేనని అధికారులు తెలిపారు. ఈ పరిమితికి లోపల స్వల్ప ఆనవాళ్లు కనిపించినా అవి ఆరోగ్యానికి హానికరం కాదని, నిబంధనల ఉల్లంఘనగా కూడా పరిగణించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత ప్రమాణాలు అమెరికా, యూరోపియన్ యూనియన్ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని వెల్లడించారు.

కోడిగుడ్ల వినియోగం వల్ల క్యాన్సర్

సాధారణంగా కోడిగుడ్ల వినియోగం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఎఫ్ఎస్ఎస్ఏఐ మరోసారి తేల్చిచెప్పింది. ఒకవేళ ఏదైనా ప్రత్యేక బ్రాండ్ లేదా బ్యాచ్‌లో సమస్య గుర్తించినా, దాన్ని మొత్తం దేశంలోని గుడ్లకు వర్తింపజేయడం సరైంది కాదని హితవు పలికింది. వినియోగదారులు అపోహలకు లోనుకాకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచిస్తూ, కోడిగుడ్లు పోషకాలు అధికంగా ఉన్న సురక్షిత ఆహారమని సంస్థ పునరుద్ఘాటించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Chicken eggs safe Egg cancer rumors Egg safety Food safety India FSSAI clarification FSSAI statement Nitrofuran AOZ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.