📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

French Students : పాఠశాలలో టాయిలెట్లు నిర్మించిన ఫ్రెంచ్‌ విద్యార్థులు

Author Icon By Sudha
Updated: August 15, 2025 • 5:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫ్రెంచ్‌ విద్యార్థులు (French Students)భారతదేశం పట్ల తమ ఇష్టాన్ని చాటుకున్నారు. రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ కోసం వచ్చిన వారు.. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలతో మమేకమవ్వడమే కాకుండా.. ఇండియా పట్ల మమకారాన్ని చూపించారు. భారత్‌ నుంచి వెళ్లినప్పుడు ఒక జ్ఞాపకంగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో.. తాము ఉన్న ఊరిలోని పాఠశాలకు అత్యవసరమైన మరుగదొడ్ల (Toilets)సౌకర్యాన్ని నిర్మించి కానుకగా అందజేశారు.

French Students : పాఠశాలలో టాయిలెట్లు నిర్మించిన ఫ్రెంచ్‌ విద్యార్థులు

ఫ్రాన్స్‌కు చెందిన విద్యార్థుల బృందం (French Students)రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ కోసం ఉడిపి జిల్లాలోని కన్యాణ గ్రామం కుద్లు తండాకు వచ్చింది. ఈ క్రమంలోనే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పడం, సృజన్మాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల్లోని రోజూవారీ లైఫ్‌స్టైల్‌తో కలిసిపోయారు. తాజాగా వారి ఇంటర్న్‌షిప్‌ పూర్తి కావచ్చింది. దీంతో ఈ ఊరికి కేవలం ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోకూడదని ఆ బృందం భావించింది. ఎప్పటికీ ఆ గ్రామ ప్రజల మనసుల్లో నిలిచిపోవాలని తాపత్రయపడింది. ఈ క్రమంలోనే పాఠశాలకు అత్యవసరమైన సదుపాయాలను కల్పించాలని నిర్ణయించుకుంది. విద్యార్థుల కోసం పూర్తిస్థాయి మరుగుదొడ్ల సౌకర్యాన్ని సొంతంగా నిర్మించి పాఠశాలకు అందజేశారు. వారి సేవాభావం, పిల్లల పట్ల చూపిన మమకారం చూసి మురిసిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల లోపం వల్ల చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, ఈ చిన్న కానుక పెద్ద మార్పు తీసుకురావచ్చని స్థానికులు భావిస్తున్నారు. సరిహద్దులు దాటే దయకు ఇదే నిదర్శనమని కొనియాడుతున్నారు.

ఫ్రెంచ్ విద్యార్థుల సంఖ్య?

ఫ్రెంచ్ ఉన్నత విద్యలో 2.5 మిలియన్ల మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 12% మంది విదేశాల నుండి వచ్చారు. వారందరూ అత్యంత వైవిధ్యభరితమైన శిక్షణ నుండి ప్రయోజనం పొందుతున్నారు మరియు వారు ప్రతి రంగంలో, ప్రతి స్థాయిలో నమోదు చేయబడ్డారు.

ఫ్రెంచ్ డిగ్రీని ఏమంటారు?

లైసెన్స్ , మూడు సంవత్సరాల అధ్యయన కోర్సు, ఇది ఇంగ్లీష్ మాట్లాడే ప్రపంచంలో బ్యాచిలర్ డిగ్రీకి సమానమైన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. లైసెన్స్ తర్వాత, విద్యార్థులు మాస్టర్స్ డిగ్రీకి సమానమైన రెండు సంవత్సరాల అధ్యయన కోర్సు అయిన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేయవచ్చు.

ఫ్రెంచ్ కోర్సు అంటే ఏమిటి?

ఫ్రెంచ్ భాషా కోర్సులు భాషలో ప్రావీణ్యాన్ని పెంపొందించడానికి అవసరమైన విస్తృత శ్రేణి అంశాలను కవర్ చేస్తాయి . వీటిలో పదజాలం, వ్యాకరణం మరియు ఉచ్చారణ వంటి ప్రాథమిక అంశాలు ఉన్నాయి. అభ్యాసకులు సంభాషణ నైపుణ్యాలు, శ్రవణ గ్రహణశక్తి మరియు ఫ్రెంచ్‌లో చదవడం మరియు రాయడం వంటివి అన్వేషిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/jk-pilgrims-killed-in-flash-floods-in-jammu-and-kashmir/crime/530620/

Breaking News Education Projects French Students latest news Sanitation School Toilets Student Initiative Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.