సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ పార్టీలు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ పథకాలు అమలవుతున్నాయి. అయితే వీటన్నింటికీ భిన్నంగా తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే(AIADMK) ఒక అడుగు ముందుకు వేసి.. పురుష లోకాన్ని ఆశ్చర్యపరిచేలా సరికొత్త హామీని తెరపైకి తెచ్చింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఇడప్పాడి కే. పళనిస్వామి మొదటి విడత ఎన్నికల వాగ్దానాలను ప్రకటించారు. ఇందులో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే.. తాము అధికారంలోకి వస్తే సిటీ బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రకటించడం. ప్రస్తుతం అధికార డీఎంకే హయాంలో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండగా.. దానిని పురుషులకు కూడా విస్తరిస్తామని అన్నాడీఎంకే స్పష్టం చేసింది.
Read Also: Sleeper train: పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
పురుషుల నుంచి విమర్శలు
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ అమలు చేస్తున్నప్పుడు పురుషుల నుంచి అక్కడక్కడా విమర్శలు వచ్చాయి. “కేవలం ఆడవాళ్లకేనా.. మా పరిస్థితి ఏంటి?” అని సామాన్య పురుషులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఈ అసంతృప్తిని ముందే పసిగట్టిన అన్నాడీఎంకే.. సామాన్య, మధ్య తరగతి పురుషులపై ఆర్థిక భారాన్ని తగ్గించే వ్యూహంతో ఈ హామీని మేనిఫెస్టోలో చేర్చింది. మహిళలకు ఇప్పటికే ఉన్న సౌకర్యాన్ని యధాతథంగా కొనసాగిస్తూనే.. పురుషులకు కూడా ఈ వెసులుబాటు కల్పించడం ద్వారా రాష్ట్రంలోని మెజారిటీ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని పళనిస్వామి భావిస్తున్నారు. అన్నాడీఎంకే కేవలం ఈ ఒక్క హామీతోనే ఆగలేదు. మొదటి దశ వాగ్దానాల్లో భాగంగా మరో నాలుగు కీలక పథకాలను కూడా ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: