శ్రీలంక (Sri Lanka)లో ఒక పెద్ద రాజకీయ దుమారం రాజుకుంది. మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe) ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. కారణం – ప్రభుత్వ నిధుల దుర్వినియోగం. 2023 సెప్టెంబర్‌లో లండన్‌కి వెళ్లిన ఆయన, తన భార్య స్నాతకోత్సవానికి హాజరయ్యారు. అయితే ఆ ప్రయాణ ఖర్చుల్ని ప్రభుత్వ ఖజానా నుంచే భరిస్తే, ఎలాగంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి.ఈ కేసులో కొలంబో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఆయనను ఆగస్ట్ 22న అరెస్ట్ చేసింది. తర్వాత కొలంబో ఫోర్ట్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నించినా, కోర్టు నిరాకరించింది. సాక్ష్యాలు సరిగా సమర్పించలేకపోయారని పేర్కొంటూ, మ్యాగజైన్ జైలుకు తరలించాలంటూ ఆదేశించింది.రిమాండ్‌కి వెళ్లిన తర్వాత రణిల్ ఆరోగ్య పరిస్థితి కాస్త భయాందోళనకు గురిచేసింది. బీపీ, షుగర్ స్థాయిలు పెరిగిపోయి, ఆయన్ను వైద్య పరీక్షల కోసం కొలంబో నేషనల్ హాస్పిటల్కి తరలించారు. అక్కడి వైద్యులు ఆయనను ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
రాజకీయ కుట్ర అంటున్న ప్రతిపక్షం
ఈ అరెస్టు చుట్టూ రాజకీయ దుమారం తప్పలేదు. మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సతో పాటు, ప్రధాన ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస, మరికొంత మంది నేతలు ఆయనను పరామర్శించారు. ఇదంతా రాజకీయ పగల వల్లే జరిగిందని, ఆయనను రిమాండ్‌కు తరలించడం ఒక కుట్ర భాగమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ కేసులో రణిల్ దోషిగా తేలితే, కనీసం ఒక సంవత్సరం జైలు నుంచి, గరిష్టంగా 20 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై శ్రీలంక చట్టాలు కఠినంగా ఉంటాయి.రణిల్ విక్రమసింఘే రాజకీయ జీవితమే ఓ విశేష గాథ. 76 ఏళ్ల వయసులో ఉన్న ఆయన, ఐదు సార్లు ప్రధానిగా, ఒకసారి అధ్యక్షుడిగా పని చేశారు. 2022లో దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు, విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని ముందుకు నడిపిన నాయకుడు కూడా ఆయనే. కానీ, 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.
ప్రజల్లో మిశ్రమ స్పందనలు
ఒరుక్కుని ఉన్న శ్రీలంక ప్రజలు ఈ అంశంపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరు చేసినా తప్పు అయితే శిక్షించాలి అంటున్నారు కొందరు. మరికొందరు మాత్రం, రాజకీయంగా వ్యతిరేకులను టార్గెట్ చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.ఇప్పుడు అసలు ప్రశ్న – ఈ కేసు నిజంగా న్యాయపరంగా నడుస్తుందా? లేక రాజకీయ కసి నేపథ్యమా? అనేది. కోర్టు విచారణలో అసలు వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also :