పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ తరఫున కేంద్ర మంత్రిగా సేవలందించిన జాన్ బార్లా ఈరోజు అధికార తృణమూల్ కాంగ్రెస్లో (John Barla joins congress) చేరారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అలీపురద్వార్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపీగా గెలిచిన ఆయన, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖలో సహాయ మంత్రిగా పనిచేశారు.
బిజెపి టికెట్ రాలేదనే కారణం
అయితే 2024 సాధారణ ఎన్నికల నేపథ్యంలో బార్లా పార్టీకి అనుకూలంగా లేరనే విమర్శలు రావడంతో, బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆయన తృణమూల్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం మొదలైంది. చివరికి, బెంగాల్ టీఎంసీ చీఫ్ సుబ్రతా బక్షి సమక్షంలో ఆయన అధికారికంగా తృణమూల్ పార్టీలో చేరారు.
బీజేపీకి రాజకీయంగా నిరాశ
జాన్ బార్లా చేరికతో తృణమూల్ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. కాగా ఈ పరిణామం బీజేపీకి రాజకీయంగా నిరాశను మిగిల్చినట్లయింది. మరోవైపు, బార్లా చేరికతో అలీపురద్వార్ నియోజకవర్గంలో తృణమూల్ తన బలాన్ని మరింతగా పెంచుకోనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : Earthquake in Turkey : తుర్కియే దేశంలో భూకంపం