📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Food Shortage : పాక్ ఆర్థిక వృద్ధిరేటు 2.7 శాతానికి తగ్గింపు

Author Icon By Divya Vani M
Updated: April 27, 2025 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌తో సంబంధాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు మరో శాక్ తగిలింది.వరుస ఆర్థిక సంక్షోభాలతో తల్లడిల్లుతున్న ఆ దేశానికి తాజాగా ప్రపంచ బ్యాంక్ మళ్లీ చెడు వార్తను చెప్పింది.ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం, పాకిస్థాన్‌లో కోటిమందికిపైగా ప్రజలు ఆకలితో బతుకుల కోసం పోరాడుతున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో పంట దిగుబడి బాగా పడిపోయింది.ఈ పరిస్థితి మరింత ఆహార సంక్షోభాన్ని పెంచే ప్రమాదం ఉంది.వాతావరణ మార్పుల కారణంగా బియ్యం, మొక్కజొన్న వంటి పంటలపై తీవ్ర ప్రభావం పడింది.దీంతో ఆహార దొరికే అవకాశం తగ్గిపోగా, దాని ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి.ఈ పరిస్థితి పేదలపై మరింత భారం మోపుతోంది.

ఆర్థిక వృద్ధి క్షీణత – భవిష్యత్తుపై భయం

ప్రపంచ బ్యాంక్ తాజాగా పాకిస్థాన్ ఆర్థిక వృద్ధి అంచనాను 2.7 శాతానికి తగ్గించింది.పెరుగుతున్న అప్పులు, అసమర్థమైన ఆర్థిక విధానాలు దీనికి ప్రధాన కారణాలుగా చెప్పబడుతున్నాయి.బడ్జెట్ లోటు లక్ష్యాన్ని చేరుకోలేని ప్రమాదం ఉందని కూడా పేర్కొంది.పాకిస్థాన్ అప్పు-జీడీపీ నిష్పత్తి వేగంగా పెరుగుతోంది.ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండటంతో నిరుద్యోగిత పెద్దగా ఉంది. ప్రజలు పని లేకుండా ఇబ్బందులు పడుతున్నారు.ఈ పరిస్థితి యువతపై గాఢ ప్రభావం చూపుతోంది.

మహిళల పాత్ర చాలా తక్కువగా ఉంది

నివేదిక ప్రకారం, మహిళలు, యువత కార్మిక రంగాల్లో చాలా తక్కువగా పాల్గొంటున్నారు.ఉపాధి-జనాభా నిష్పత్తి కేవలం 49.7 శాతంగా ఉంది.ఇది ఆ దేశ అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారింది.భారత్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా పరిస్థితులు మరింత కఠినతరమయ్యాయి.ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌పై ఒత్తిడి ఎక్కువైంది.ప్రపంచ బ్యాంక్ నివేదిక ఈ సెన్సిటివ్ టైమ్‌లో వెలువడటం గమనార్హం.జనాభా వృద్ధి రేటు 2 శాతం ఉన్న నేపథ్యంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 19 లక్షల మంది పేదరికంలోకి జారిపోతారని హెచ్చరిక వచ్చింది.వాస్తవ వేతనాలు కూడా తగ్గుముఖం పట్టడంతో ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతింటోంది.

Read Also : Iran President : కశ్మీర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఇరాన్

Pakistan Agriculture Decline Pakistan economic crisis Pakistan Food Shortage 2025 Pakistan Hunger Crisis Poverty in Pakistan World Bank Report on Pakistan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.