Food Menu: వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్

Read Time:  1 min
Food Menu: వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్
FONT SIZE
GET APP

అసోంలోని కామాఖ్య- బెంగాల్‌లోని హౌరా వందేభారత్ స్లీపర్ సెమీ-హైస్పీడ్ రైల్లో కేవలం శాకాహార పదార్థాలు మాత్రమే సర్వ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శాకాహారంతో పాటు మాంసాహారం కూడా అందుబాటులోకి తెచ్చింది. (Food Menu) ఇకపై అస్సామీ స్టైల్ చికెన్ కర్రీ ఫుడ్ మెనులో ఉంటుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ప్రకటించారు.

Read Also: TG Govt: యాదగిరిగుట్ట భక్తులకు శుభవార్త.. త్వరలో MMTS రైలు ప్రారంభం!

Food Menu: వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్
In the Vande Bharat sleeper train, chicken will be served instead of the vegetarian curry.

శాకాహార వంటకంలోని పన్నీర్ మసాలా స్థానంలో అస్సామీ చికెన్ కర్రీని తీసుకొచ్చారు. ఇందులో జీరా కార్న్ పులావ్, టెహ్తర్ పరాఠా, దాల్ (కందిపప్పు-పెసరపప్పు మిశ్రమం), అస్సామీ స్టైల్ బీన్స్ కర్రీ, స్వీట్ బెంగాల్‌ రసగుల్లా ఉంటాయి. (Food Menu) హౌరా- కామాఖ్య వందేభారత్ స్లీపర్ రైలులో ఆదివారం నుంచి నాన్-వెజ్ ఆహారం ధరలు అందుబాటులోకి వచ్చినట్టు ఈశాన్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఉదయ్ శంకర్ ఝా అన్నారు.

జనవరి 31న వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం ‘వందేభారత్ స్లీపర్ రైలు ప్రయాణికుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నాన్-వెజ్ ఆప్షన్‌గా చికెన్ కర్రీ (50 నుంచి 60 గ్రాములు బోన్‌లెస్ చికెన్, 70 గ్రాములు గ్రేవీ) అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం.. శాకాహార వంటకం స్థానంలో దీనిని తీసుకొస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.