దేశవ్యాప్తంగా (Food Delivery Services) గిగ్-ఎకామర్స్ ప్లాట్‌ఫారమ్ లో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ బంద్‌కు పిలుపునిచ్చారు. తమ ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, మెరుగైన వేతనాలు, పెన్షన్ వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా స్విగ్గీ, జోమాటో వంటి ప్రముఖ గిగ్-ఎకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను లక్ష్యంగా చేసుకుని డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున, అలాగే డిసెంబర్ 31న న్యూ ఇయర్ సందర్భంగా బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించారు.
Read Also: RRB: రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల
డెలివరీ సేవలు తాత్కాలికంగా నిలిచిపోవచ్చు
ఈ బంద్‌లో భాగంగా డెలివరీ బాయ్స్ రెండు గంటల పాటు పనిని (Food Delivery Services) నిలిపివేయనున్నారు. దీని ప్రభావం దేశంలోని ప్రధాన నగరాల్లో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో ఫుడ్ డెలివరీ సేవలు తాత్కాలికంగా నిలిచిపోవచ్చని అంచనా వేస్తున్నారు. పండుగలు, సెలబ్రేషన్ల సమయంలో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లపై ఆధారపడే వినియోగదారులకు ఇది ఇబ్బందిగా మారనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: