Floods: ధరాలీ వరద విలయంపై విడుదలైన శాటిలైట్ చిత్రాలు

Read Time:  1 min
Uttarkashi: ధరాలి విషాదానికి కారణం.. వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణ
Uttarkashi: ధరాలి విషాదానికి కారణం.. వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణ
FONT SIZE
GET APP

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లా ధరాలీ గ్రామంలో ఆగస్టు 5న సంభవించిన విపత్తు మొత్తం దేశాన్ని కలవరపరిచింది. కేవలం 30 సెకన్లలోనే ఒక అందమైన పర్వత ప్రాంతం పూర్తిగా ధ్వంసమవడం అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. సహజ సౌందర్యంతో మెరిసే ఈ గ్రామం ఒక్కసారిగా వచ్చిన వరద బీభత్సానికి మిగిలింది కేవలం శిథిలాలే. 12,600 అడుగుల ఎత్తులోని కొండపై నుంచి ఒక్కసారిగా వచ్చిన నీటి ప్రవాహం, ఆపై శిథిలాలతో మిక్స్ అయిన రెండవ ప్రవాహం ఆ ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా చేసింది. ఈ విపత్తు తర్వాత ప్రజలు, అధికారులు, శాస్త్రవేత్తలు ఒకే ప్రశ్నతో తల్లడిల్లుతున్నారు – ఇంత భారీ విధ్వంసం ఒక్కసారిగా ఎందుకు జరిగింది?మొదట్లో అందరూ క్లౌడ్ బరస్ట్ కారణంగా ఈ విపత్తు సంభవించినట్లు భావించారు. అయితే ఈ ఘటనపై లోతుగా పరిశోధన చేసిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త ఇమ్రాన్ ఖాన్ (Geologist Imran Khan) అసలు కారణాలను బయటపెట్టారు. ఆయన ప్రస్తుతం భూటాన్‌లోని పీహెచ్ పీఏ-1 ప్రాజెక్ట్‌లో సీనియర్ జియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు.

ధరాలీ సమీపంలో

శాటిలైట్ చిత్రాలను పరిశీలించి ఒక ప్రాథమిక భౌగోళిక అంచనాను రూపొందించారు. ఆ నివేదికను సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన ప్రకారం, ధరాలీ సమీపంలో ఉన్న గ్లేసియర్ డిపాజిట్స్ ఈ విపత్తుకు ప్రధాన కారణమని తేల్చారు.అధిక వర్షంతో పాటు ఈ ప్రాంతంలో మంచుకొండలు (Glacial Sedimentary Deposits) అకస్మాత్తుగా విచ్ఛిన్నం కావడం వల్లే ఈ విపత్తు జరిగినట్లు భూవిజ్ఞాన శాస్త్రవేత్త ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ఏకంగా 360 మిలియన్ క్యూబిక్ మీటర్ల శిథిలాలు ఒక్కసారిగా కూలినట్లు ఆయన వెల్లడించారు. ధరాలీ సమీపంలో గ్లేసియర్ డిపాజిట్స్ గుర్తించినట్లు వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ పంచుకున్న శాటిలైట్ చిత్రాల ప్రకారం, ధరాలీ గ్రామానికి సుమారు 7 కిలోమీటర్ల ఎగువన, సముద్ర మట్టానికి 6,700 మీటర్ల ఎత్తులో ఒక గ్లేసియర్ డిపాజిట్ ఉంది. ఆగస్టు 5న అధిక వర్షాపాతం నమోదైంది. ఈ వర్షం వల్ల భారీ ఉపరితల ప్రవాహం పెరిగి గ్లేసియర్ డిపాజిట్స్ విచ్ఛిన్నమైనట్లు పేర్కొన్నారు.

Floods:
Floods:

భారీ వర్షాలు

పర్వత ప్రాంతాల్లో మంచు రాశులు ఒక దగ్గర పేరుకుపోయి ఒక కొండగా ఏర్పడుతాయి. చిన్న చిన్న మంచు రాశులు కదిలే సమయంలో అవి తమ మార్గంలో ఉన్న రాళ్లు, కంకర, మట్టి, చిన్న చిన్న బండరాళ్ళను తనలో కలుపుకుని ముందుకు సాగుతుంది. ఆ మంచు రాశులన్నీ ఒకచోట కలిసి మంచు కొండ ఏర్పడుతుంది. ఆ కొండలోనే రాళ్లు, కంకర, మట్టి, చిన్న చిన్న బండరాళ్లు పేరుకుపోతాయి. అయితే కాల క్రమంలో ఆ మంచుకొండ కరిగిపోతుంది. కానీ, అక్కడ పేరుకుపోయిను రాళ్లు, కంకర, మట్టి అక్కడే గుట్టలా ఏర్పడుతుంది. హిమానీనదాలు అలా వదిలేసిన రాళ్ళు, మట్టి శిథిలాలనే గ్లేసియర్ డిపాజిట్లు అని అంటారు. ఈ డిపాజిట్లు కొన్నిసార్లు చాలా పెద్దగా, అస్థిరంగా ఏర్పడుతాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు, చినుకులు బలంగా ఆ డిపాజిట్లను తాకినప్పుడు అవి విచ్ఛిన్నమవుతాయి. ఫలితంగా వర్షాలు పడినప్పుడు వచ్చిన వరద కంటే ఈ ప్రవాహం చాలా తీవ్రంగా, ప్రమాదకరంగా ఉంటుంది. ఇప్పుడు ధరాలీలో జరిగింది కూడా ఇదే అని శాస్త్రవేత్త ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నారు.

ఒక్కసారిగా విరిగి

గ్లేసియల్ నిక్షేపం కూలిపోవడం: ధారాలీ గ్రామానికి 7 కిలోమీటర్ల ఎగువన, సముద్ర మట్టానికి 6,700 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక భారీ గ్లేసియల్ నిక్షేపం కూలిపోయింది. ఈ మట్టి, రాళ్లతో కూడిన నిక్షేపాలు సుమారు 300 మీటర్ల మందంతో 1.12 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి.క్లౌడ్ బరస్ట్ ప్రభావం: ఆగస్టు 5న కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ గ్లేసియల్ నిక్షేపాలపై నీరు అధికంగా చేరి, వాటి స్థిరత్వాన్ని దెబ్బతింది. దీంతో అది ఒక్కసారిగా విరిగి, భారీ శిథిలాల ప్రవాహానికి దారితీసింది.వేగవంతమైన ప్రవాహం: నిటారుగా ఉన్న లోయ మార్గం కారణంగా, ఈ శిథిలాలు అత్యంత వేగంగా కిందకి దూసుకువచ్చాయి. ఇది కేవలం ఒక నిమిషంలోపే ధారాలీ గ్రామాన్ని చేరుకుని, వినాశనాన్ని మిగిల్చింది.శాత్రవేత్త హెచ్చరికలు:ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో పర్వత ప్రాంతాల సురక్షితతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తిందని శాస్త్రవేత్త ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ నిర్మాణ పనులు, యాత్రికుల భద్రతపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోందన్నారు.

సంఘటనలు జరగకుండా

హిమాలయ ప్రాంతాల్లోని ఇతర లోయల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చని ఈ ప్రమాదం సూచిస్తోందని ఇమ్రాన్ ఖాన్ గుర్తు చేశారు. ఈ సమస్యపై దృష్టి పెట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించడానికి ఆయన మూడు సిఫార్సులు చేశారు.నది ఒడ్డున, శిథిలాల ప్రవాహ మార్గాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు.ప్రమాదకరమైన ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.హిమాలయాల్లోని గ్లేసియల్ ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ, అధ్యయనం అవసరం.

ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని ఏది?

ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ (Dehradun). శీతాకాల రాజధానిగా గైర్సైన్ (Gairsain) కూడా గుర్తించబడింది.

ఉత్తరాఖండ్ రాష్ట్ర అధికారిక భాషలు ఏమిటి?

హిందీ మరియు సంస్కృతం రాష్ట్ర అధికారిక భాషలు. గర్హ్వాలి, కుమాయోని ప్రాంతీయ భాషలు కూడా మాట్లాడబడతాయి.

    Read hindi news: hindi.vaartha.com

    Read Also:

    https://vaartha.com/bangladesh-calls-india-friend-shocks-china-pakistan/international/526761/

    Anusha

    రచయిత గురించి

    Anusha

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.