పండుగ సీజన్‌కు మరింత ఉత్సాహం తెచ్చేలా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరో బంపర్ ప్రకటన చేసింది. కొత్త ఏడాదిలో తొలి భారీ సేల్‌కు సిద్ధమవుతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ తేదీలను సంస్థ ఖరారు చేయడంతో ఆన్‌లైన్ మార్కెట్‌లో సందడి మొదలైంది.
Read Also: Vijay: సుప్రీంకోర్టులో ‘జన నాయగన్’ మూవీ కు నిరాశ
డిస్కౌంట్
రిపబ్లిక్ డే సేల్ జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఇయర్‌బడ్స్‌తో పాటు గృహోపకరణాలపై భారీ తగ్గింపులు ఉంటాయి. యాపిల్, వివో, మోటోరోలా, రియల్‌మి, నథింగ్ వంటి బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 16 రూ.56,999కి, గూగుల్ పిక్సల్ 10 రూ.60,999కి లభించనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: