📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : Flipkart – తాత్కాలిక ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటన..

Author Icon By Sudha
Updated: August 25, 2025 • 4:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) శుభవార్త చెప్పింది. రానున్న పండుగ సీజన్‌ ను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించింది. తన వార్షిక మెగా సేల్ ‘ది బిగ్ బిలియన్ డేస్’ కోసం దేశవ్యాప్తంగా కొత్తగా 2 లక్షలకు పైగా తాత్కాలిక (seasonal job opportunities) ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. పండుగల సీజన్ వస్తోంది. ఆగస్టు 27న వినాయక చవితి, సెప్టెంబరు 22 నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత దసరా, దీపావళి ఇలా వరుస పండుగలు ఉన్నాయి. ఏటా పండుగల సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే. పండుగ సీజన్‌లో తక్కువ ధరకే పలు వస్తువులను సేల్‌కు పెడుతుంది. దీంతో ఆ సమయంలో పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తుంటాయి. వాటిని కస్టమర్లకు సకాలంలో డెలివరీ చేసేందుకు మానవ వనరులు అవసరం ఏర్పడుతుంది.

Flipkart – తాత్కాలిక ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటన..

అందుకోసం ఏటా పండుగల సీజన్‌లో ఉద్యోగాలను భర్తీ చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా దాదాపు 28 రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)సోమవారం ప్రకటించింది. 2.2 లక్షల సీజనల్ ఉద్యోగఅవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లోని యువతకు ఉపాధి కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొంది. కంపెనీ ప్రకారం.. ఈ నియామకాలు ప్రధానంగా సప్లైచైన్‌, లాజిస్టిక్స్‌, లాస్ట్‌-మైల్‌ డెలివరీ వంటి విభాగాల్లో ఉండనున్నాయి. మొత్తం నియామకాల్లో 15 శాతం మంది మొదటిసారి ఉద్యోగంలో చేరుతున్న వారే. ప్యాకర్స్‌, పికర్స్‌, సార్టర్స్‌, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల కోసం నియామకాలు జరగనున్నాయి. గతేడాదితో పోలిస్తే మహిళలు, వికలాంగులు (పీడబ్ల్యూడీ), ఎల్జీబీటీక్యూఐఏ వర్గాల వారికి అధికంగా అవకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ తన ప్రకటనలో వివరించింది.

ఫ్లిప్కార్ట్ ఫుల్ ఫారం?

‘f’ అనే అక్షరం స్పీడ్ లైన్లతో కూడి ఉంటుంది. ఇది సానుకూల మరియు శీఘ్ర సేవను సూచించడానికి ఉద్దేశించబడింది. ఎంచుకున్న రంగులు ఊహాత్మకత, ఉల్లాసం మరియు కలుపుగోలుతనాన్ని సూచిస్తాయి. ‘ఫ్లిప్‌కార్ట్’ అనే పేరుకు ‘ వస్తువులను కార్ట్‌లోకి తిప్పడం ‘ అని అర్థం.

ఫ్లిప్కార్ట్ సీఈఓ జీతం ఎంత?

ఫ్లిప్‌కార్ట్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అంచనా వేసిన మొత్తం వేతన పరిధి సంవత్సరానికి ₹19.2 లక్షలు–₹20.8 లక్షలు , ఇందులో మూల జీతం మరియు అదనపు వేతనం కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో సగటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మూల జీతం సంవత్సరానికి ₹20.0 లక్షలు.

ఫ్లిప్కార్ట్ ఈఎంఐ అంటే ఏమిటి?

ఫ్లిప్‌కార్ట్ EMI అనేది ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో అందుబాటులో ఉన్న చెల్లింపు విధానం, ఇది మీరు ఇప్పుడే షాపింగ్ చేసి, మీ కొనుగోళ్లకు 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు మరియు 12 నెలల స్థిర కాలపరిమితితో ఇబ్బంది లేని సులభమైన నెలవారీ వాయిదాల ద్వారా తిరిగి చెల్లించడానికి అనుమతిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ai-technology-ai-that-can-sense-impending-disaster-in-advance/tech/535823/

Breaking News E-commerce Jobs Flipkart Flipkart Hiring latest news Seasonal Employment Telugu News Temporary Jobs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.