Flipkart layoffs : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగుల కోతలు చర్చనీయాంశంగా మారాయి వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా సుమారు 250 నుంచి 300 మంది ఉద్యోగులను కంపెనీ విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.
వివిధ విభాగాలు మరియు స్థాయిలలో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ ప్రభావం పడినట్లు తెలుస్తోంది కంపెనీ త్వరలో ఐపీఓకు సిద్ధమవుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ విషయంపై ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం స్పందిస్తూ ఉద్యోగుల పనితీరును క్రమం తప్పకుండా సమీక్షించడం సంస్థలో సాధారణ ప్రక్రియ అని తెలిపింది నిర్దేశిత ప్రమాణాలను అందుకోలేకపోయిన కొద్ది శాతం మంది ఉద్యోగులు సంస్థ నుంచి వైదొలగాల్సి వస్తుందని పేర్కొంది.
Read Also: Israel Iran War: 50 యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి
ఎంత మంది ఉద్యోగులను తొలగించారన్న వివరాలను మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.
ఇదిలా ఉండగా ఒకవైపు ఐపీఓ కోసం సన్నాహాలు కొనసాగిస్తూనే మరోవైపు కొన్ని కీలక పదవుల్లో కొత్త నియామకాలు కూడా చేస్తున్నట్లు సమాచారం.
2024లో కూడా ఫ్లిప్ కార్ట్ దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే
వాల్ మార్ట్ మద్దతుతో పనిచేస్తున్న ఫ్లిప్ కార్ట్ త్వరలో పబ్లిక్ ఇష్యూ కోసం సన్నాహాలు చేస్తోంది ఇందులో భాగంగా సింగపూర్ లో ఉన్న తన ప్రధాన కార్యాలయాన్ని భారత్ కు మార్చింది
భారత నియంత్రణ సంస్థల నిబంధనలకు అనుగుణంగా కంపెనీ తన హోల్డింగ్ నిర్మాణంలో కూడా మార్పులు చేసినట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: