తాజాగా Air India ఫ్లైట్ ప్రమాదంపై విమానయాన నిపుణులు వివిధ కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ప్రముఖ పైలట్ మరియు ఏవియేషన్ ఎక్స్పర్ట్ కెప్టెన్ స్టీవ్ (Aviation Expert Captain Steve), బోయింగ్ 777 మరియు 787 వంటి పెద్ద విమానాలను నడిపిన అనుభవంతో ఈ ఘటనను విశ్లేషించారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. ఈ క్రాష్‌కు ఒకే ఒక కారణం చెప్పడం కష్టమే. ఇది నేరుగా ఇంజిన్ ఫెయిల్యూర్ వల్లే జరిగిందని చెప్పలేమని ఆయన స్పష్టం చేశారు.
ఫ్లాప్ సెట్టింగ్స్ పై అనుమానాలు
కెప్టెన్ స్టీవ్ పేర్కొన్న ముఖ్యమైన అంశం ప్రకారం, విమానం టేకాఫ్ సమయంలో ఫ్లాప్ సెట్టింగ్ ఎంతో కీలకం. కానీ ప్రమాదానికి సంబంధించిన వీడియోను పరిశీలించగా, ఫ్లాప్స్ ఓపెన్ చేసినట్లు కనిపించడంలేదని ఆయన తెలిపారు. ఫ్లాప్స్ వాడకపోతే విమానం లిఫ్ట్ పొందడంలో సమస్యలు వస్తాయని, అది టేకాఫ్ లో విఫలానికి దారితీయవచ్చని అన్నారు. పైగా, ఇంజిన్‌లో మంటలు కనిపించకపోవడం వల్ల ఇంజిన్ స్టాలింగ్ కంటే వేరే కారణాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
గేరప్ సమయానికి చేయకపోవడం కారణమా?
విమానాన్ని ఎక్కించే సమయంలో గేర్-అప్ (ల్యాండింగ్ గేర్ మడచివేసే చర్య) కూడా సమయానికి చేయకపోవడం ప్రమాదానికి కారణమవుతుందని కెప్టెన్ స్టీవ్ అన్నారు. టేకాఫ్ సమయంలో అన్ని ప్రమాణాలు పూర్తిగా అనుసరించకపోతే, విమానం తక్కువ ఎత్తులో స్థిరత కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకూ లభించిన దృశ్య ఆధారాల ప్రకారం, క్రాష్ వెనుక సాంకేతిక లోపాలు కాకపోయినా, ఆపరేషన్‌లో ఉన్న మార్గదర్శకాల్లో తేడాలు ఉండొచ్చని ఆయన విశ్లేషించారు.
Read Also : KCR : కేసీఆర్ కు వైద్య పరీక్షలు