📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Telugu News: Flight Cancellations: ఇండిగో సంక్షోభం తీవ్రం: మరో 400 ఫ్లైట్లు రద్దు

Author Icon By Pooja
Updated: December 5, 2025 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత మూడు రోజులుగా నిర్వహణలో లోపాలు, సిబ్బంది సమస్యల కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనూహ్యంగా ఎన్నో విమానాలు రద్దు(Flight Cancellations) కావడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి మెరుగయ్యే సూచనలు కనిపించకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం మరింత పెరిగింది. శుక్రవారం రోజునే 400కు పైగా విమానాలు రద్దు కావడం సమస్యను మరింత క్లిష్టం చేసింది. వీటిలో సగానికి పైగా ఢిల్లీ విమానాశ్రయానికి చెందినవే.

Indian aviation news : ఇండిగోకు షాక్ ఒక్కరోజే 550 ఫ్లైట్లు రద్దు, ఆపరేషన్లు…

Flight Cancellations: IndiGo crisis deepens: 400 more flights cancelled

ప్రధాన విమానాశ్రయాల్లో పెద్ద ఎత్తున సర్వీసుల రద్దు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో(Delhi Airport) 220కు పైగా, బెంగళూరులో 100కు పైగా, హైదరాబాద్‌లో 90 కంటే ఎక్కువ సర్వీసులను( Flight Cancellations) ఇండిగో రద్దు చేసింది. ఇతర ప్రధాన విమానాశ్రయాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. విమానాలు రద్దయినందున ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రయాణికుల ఇబ్బందులు పెరిగిన విధానం

చాలా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాంజ్‌లలో చోటు లేక నేలపై నిద్రించే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఇండిగో షేర్లు కూడా వరుసగా పడిపోతూ శుక్రవారం 9% కంటే ఎక్కువ నష్టాన్ని చవిచూశాయి.

సమస్యల నేపథ్యంలో ఇండిగో తీసుకున్న చర్యలు

తాజా పరిణామాల నేపథ్యంలో ఇండిగో సంస్థ DGCAను సంప్రదించి,

ఇండిగో ప్రకారం, విమాన సర్వీసులు పూర్తిగా సవ్య స్థితికి రావడానికి ఫిబ్రవరి 10 తర్వాతే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 8 నుంచి కొన్ని సర్వీసులను తగ్గించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ప్రయాణికులకు క్షమాపణలు కూడా తెలిపింది.

హైదరాబాద్, విశాఖలో పరిస్థితి ఉద్రిక్తం

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో 92 సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

చెక్–ఇన్ పూర్తయ్యాక విమాన రద్దు సమాచారాన్ని ఇవ్వడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

విశాఖపట్నం నుంచి కూడా 8 సర్వీసులు రద్దు అయ్యాయి. ఇవి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ రూట్లకు చెందినవి.

అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక విమాన సదుపాయం

ఇండిగో రద్దుల వల్ల శబరిమలకు వెళ్లాల్సిన భక్తులు చిక్కుల్లో పడిన నేపథ్యంలో, ఏపీ మంత్రి పార్థసారథి జోక్యం చేసుకున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌తో మాట్లాడి భక్తుల కోసం ప్రత్యేక విమాన సదుపాయం కల్పించించారు. తనకు వెళ్లాల్సిన విజయవాడ విమానం రద్దు కావడంతో పార్థసారథి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరినా, అయ్యప్ప భక్తులు ఆయన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AirTravelUpdates Google News in Telugu HyderabadAirport IndiGoIssues Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.