📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Woman Harased : ఐదేళ్ల చిన్నారిని హత్య చేసి తల్లిపై అత్యాచారం

Author Icon By Sudheer
Updated: April 25, 2025 • 1:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హరియాణాలోని జింద్ జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మురికివాడలో నివసించే ఒక నిరుపేద కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని, నలుగురు దుండగులు అమానవీయంగా ప్రవర్తించారు. ఐదేళ్ల చిన్నారిని గొంతు నులిమి హత్య చేసి, ఆమె తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత కుటుంబం చెత్త సేకరించడమే జీవనాధారంగా జీవిస్తుండగా, గతంలో పలు వివాదాల నేపథ్యంలో ఈ దురాగతం జరిపినట్లు తెలుస్తోంది.

పదిహేను రోజుల క్రితం బాధితురాలి భర్తకు అమిత్ అనే వ్యక్తితో గొడవ జరుగగా, దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఇరుపక్షాలను పిలిపించి వివాదాన్ని పరిష్కరించినప్పటికీ, అమిత్ కక్ష పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో, అమిత్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి బాధితురాలిపై దాడికి పాల్పడ్డాడు. ఆమెను మరియు ఆమె ఐదేళ్ల కుమార్తెను చెత్త కుప్ప వద్దకు లాక్కెళ్లి, చిన్నారిని హత్య చేశాడు. అనంతరం బాధితురాలిపై నలుగురు కలిసి అత్యాచారానికి పాల్పడి అపస్మారక స్థితిలో వదిలేశారు.

బుధవారం ఉదయం మహిళలు బాధితురాలిని గమనించి సహాయం అందించగా, తర్వాత ఆమె స్పృహలోకి వచ్చి జరిగిన విషయాలను వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృత చిన్నారి శవాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించి, నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నారిపై కూడా లైంగిక దాడి జరిగిందని అనుమానాలు ఉన్నాయని, ఫలితాలు వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందని ఎస్‌ఐ యశ్వీర్ తెలిపారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది.

Five-year-old child murder Jind mother raped

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.