కేరళలో దాదాపు మూడు శతాబ్దాల తర్వాత కుంభమేళా జరుగుతోంది. నీలా నది(Nila river) (భారతపుళ) తీరంలో కేరళ (Kerala) కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన‘మహామాఘ మహోత్సవం’ ప్రారంభమైంది. మలప్పురం జిల్లా తిరునవయలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ఈ క్రతువును లాంఛనంగా ప్రారంభించారు. మాహామండలేశ్వర్ స్వామి ఆనందవనం భారతి మహారాజ్ నేతృత్వంలో మొదటి స్నానం నవముకుంద ఆలయ స్నాన ఘాట్‌లో జరిగింది. ఈ ఉత్సవాన్ని 270 ఏళ్ల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత పూర్తిస్థాయిలో నిర్వహించడం చెప్పుకోదగ్గ అంశం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. 1755లో ఈ కుంభమేళా జరిగినట్లు సమాచారం.
Read Also: White House: రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌కు విముక్తి కల్పిస్తాం: ట్రంప్
50 వేల మందికిపైగా నీలా నదిలో పవిత్ర స్నానాలు
ఫిబ్రవరి 3 వరకు కొనసాగే ఈ కుంభమేళా ఉత్సవానికి కేరళ, తమిళనాడు , కర్ణాటక సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. రోజుకు దాదాపు 50 వేల మందికిపైగా నీలా నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. వేడుకల్లో భాగంగా కాశీ పండితుల ఆధ్వర్యంలో రోజూ సాయంత్రం నీలానది హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు కేరళ ఆర్టీసీ.. 100 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అలాగే, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కేరళ సంప్రదాయ విద్య కలరిపయట్టు, యోగతో పాటు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ కుంభమేళాలో భాగమైన రథయాత్ర కు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది తమిళనాడులోని ఉడుమల్‌పేట సమీపంలోని తిరుమూర్తి కొండ నుంచి సోమవారం ఉదయం రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా ప్రభుత్వం నిలిపివేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: