భారతదేశం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వచ్చే ఏడాది నుంచి పట్టాలెక్కనుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం, తొలి బుల్లెట్ రైలు 2027 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సూరత్ నుంచి బిలిమోరా మధ్య తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, దశల వారీగా ట్రాక్ నిర్మాణాన్ని పూర్తి చేసి, నిర్ణీత గడువులోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
తొలి దశలో ఈ హైస్పీడ్ రైలును ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య నడపనున్నారు. ఈ మార్గం మొత్తం సుమారు 508 కిలోమీటర్ల మేర ఉంటుంది. అత్యంత ఆధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా, రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనివల్ల ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. కేవలం మూడు గంటలలోపే ఈ రెండు ప్రధాన నగరాల మధ్య దూరాన్ని చేరుకోవచ్చు. ఇది వాణిజ్య పరంగా మరియు పారిశ్రామికంగా ఇరు రాష్ట్రాలకు ఎంతో మేలు చేకూరుస్తుంది.
Crime News: యువతి దారుణ హత్య.. ఎక్కడంటే?
ఈ ప్రాజెక్టులోని అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ ట్రాక్ ప్రధానంగా అండర్ గ్రౌండ్ (భూగర్భం) ద్వారా వెళ్లేలా డిజైన్ చేశారు. ముఖ్యంగా ముంబైలోని సముద్ర తీర ప్రాంతాల్లో 7 కిలోమీటర్ల మేర సముద్రం లోపల సొరంగ మార్గం ద్వారా రైలు ప్రయాణించనుంది. జపాన్ సహకారంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. పర్యావరణానికి తక్కువ హాని కలిగించేలా, అత్యాధునిక సెన్సార్లు మరియు ఆటోమేటిక్ కంట్రోల్ వ్యవస్థలతో ఈ బుల్లెట్ ట్రైన్ భారతీయులకు సరికొత్త ప్రయాణ అనుభవాన్ని అందించనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com