తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు (From Tirupati to Secunderabad) వెళ్లుతున్న సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం రాత్రి భారీ ప్రమాదం తప్పింది. రైలు ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం మండలంలో చిగిచెర్ల వద్దకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులతో నిండిన రైల్లో మంటలు రావడం చూసి అందరూ ఉలిక్కిపడ్డారు.
బోగీలో మంటలు – ప్రయాణికుల్లో భయాందోళనలు
12769 సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ (12769 Seven Hills Express) రాత్రి 8:55కి తిరుపతి నుంచి బయలుదేరింది. చిగిచెర్ల స్టేషన్ సమీపంలో బోగీ చక్రాల వద్ద బ్రేక్ బైండింగ్ వల్ల మంటలు చెలరేగాయి. పొగలు కనిపించిన ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది.రైలు వెనుక భాగంలో ఉన్న గార్డు ప్రయాణికుల అరుపులు విని వెంటనే స్పందించారు. లోకో పైలట్‌కు సమాచారం అందించారు. లోకో పైలట్ రైలు ఆపిన తర్వాత గార్డు, సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో తీసుకున్న చర్యలతో ప్రమాదం తప్పింది.
అరగంటకు పైగా నిలిచిన రైలు
ఈ సంఘటన కారణంగా రైలు చిగిచెర్ల వద్ద సుమారు 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. సాంకేతిక బృందం తాత్కాలికంగా సమస్యను పరిష్కరించడంతో, రైలు మళ్లీ సికింద్రాబాద్ దిశగా సాగింది. ప్రయాణికులెవరికీ గాయాలు కాకపోవడం గమనార్హం.ఈ ఘటనపై రైల్వే శాఖ సీరియస్‌గా స్పందించింది. కారణాలపై విచారణ ప్రారంభించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Read Also : Chandrababu Naidu : కార్యకర్తలు అలిగే పరిస్థితి రానివ్వనన్న చంద్రబాబు