దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జన్‌పథ్ రోడ్డు (Janpath Road)లో ఉన్న సీసీఎస్ భవనంలో ( Common Central Secretariat building) శనివారం ఉదయం మంటలు చెలరేగాయి.
ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుంది. దాదాపు 13 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తోంది.
‘జన్‌పథ్ రోడ్డులోని సీసీఎస్ భవనంలో అగ్నిప్రమాదం సభవించింది. 13 ఫైరింజన్లు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని అగ్నిమాపక శాక అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదు. కాగా, ఇటీవలే ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నివాస, వ్యాపార సముదాయాల్లో ఎక్కడో ఒకచోట మంటలు వ్యాపిస్తున్నాయి. ఇటీవలే ద్వారకా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తండ్రి, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో CCS భవనంలో ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఉన్నాయి. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Read Also:Ahmedabad : 274కి చేరిన మృతుల సంఖ్య