📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Fire Accident: తమిళనాడులో డీజిల్‌ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు

Author Icon By Sharanya
Updated: July 13, 2025 • 8:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులోని తిరువళ్లూరు (Thiruvallur) జిల్లా, పెరియకుప్పం సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. డీజిల్‌ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో అకస్మాత్తుగా మంటలు (Fire Accident) చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు అన్ని వ్యాగన్లకు వ్యాపించి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.

ప్రమాద వివరాలు:

తిరువళ్లూరులో డీజిల్‌ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు (Goods train fires) అంటుకున్నాయి. క్షణాల్లోనే అన్ని వ్యాగన్లకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అన్ని వ్యాగన్లు అగ్నికి ఆహుతయ్యాయి. ట్రాక్ సమీపంలోని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. అరక్కోణం నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్ రైలులో ఈ ప్రమాదం జరిగింది. పలు రైళ్లను నిలిపివేశారు అధికారులు.

మంటల వ్యాప్తి

ఈ గూడ్స్ రైలులో ఇంధన పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మంటలు (Fire Accident) వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ అంతటా వ్యాపించి స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఓడరేవు నుండి చమురుతో వెళ్తున్న గూడ్స్‌ రైలు అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. రైలులో ఇంధనం ఉండటంతో మంటలు మరింత వ్యాపిస్తాయని ఆందోళన చెందుతున్నారు.

అగ్నిమాపక చర్యలు

అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి చాలా కష్టపడుతున్నారు. మంటలను ఆర్పడానికి 10 కి పైగా అగ్నిమాపక యంత్రాలను మోహరించారు. మంటల కారణంగా, అరక్కోణం మీదుగా సెంట్రల్‌కు వచ్చే ఎక్స్‌ప్రెస్ రైళ్లను వివిధ ప్రదేశాలలో నిలిపివేశారు. అదనంగా ఉదయం 5.50 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ వందే భారత్ రైలును చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ శతాబ్ది రైలును కూడా నిలిపివేశారు.

రైళ్లు నిలిపివేత & ప్రయాణికుల ఇబ్బందులు

ఈ ఘటన దారి తీసిన ప్రభావంగా చెన్నై సెంట్రల్ నుండి కర్ణాటక మరియు వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లను నిలిపివేశారు, దీనివల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తెల్లవారుజామున రైలులో జరిగిన అగ్ని ప్రమాదం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది .

Read hindi news: hindi.vaartha.com

Read also: Maoist : సుక్మా జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ:23 మంది నక్సల్స్‌ లొంగుబాటు

Breaking News DieselTrainFire FireBreakout GoodsTrainAccident latest news tamilnadu Telugu News Thiruvallur TrainFire

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.