📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Sikkim : సిక్కింలో ఘోర ప్రమాదం.. ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి

Author Icon By Sudha
Updated: June 2, 2025 • 4:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈశాన్య రాష్ట్రం సిక్కిం భారీ వర్షాల ధాటికి వణుకుతోంది. ఉత్తర సిక్కిం జిల్లాలోని ఛతేన్ ప్రాంతంలో, భారీ వర్షాల కారణంగా కొండచరిలు (Landslides) సంభవించాయి. కొండలు విరిగిపడి అక్కడే ఉన్న మిలిటరీ క్యాంప్‌పై పడడంతో తీవ్ర విషాదం నెలకొంది.

Sikkim : సిక్కింలో ఘోర ప్రమాదం.. ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి

ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim)లో ఘోర ప్రమాదం సంభవించింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు ఉత్తర సిక్కింలోని ఛతేన్‌ అనే ప్రదేశంలో మిలిటరీ క్యాంప్‌పై (military camp in Sikkim) కొండచరిలు (landslides) విరిగిపడ్డాయి. ఈ ఘటనలో కనీసం ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించగా.. మరో ఆరుగురు గల్లంతయ్యారు.
రక్షణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గరు ప్రాణాలు (security personnel) కోల్పోగా.. ఆరుగురి ఆచూకీ గల్లంతైంది. మరో నలుగురు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద స్థలి నుంచి ముగ్గురి మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఆచూకీ గల్లంతైన వారికోసం సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయని రక్షణశాఖ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
వర్షం బీభత్సం
ఈశాన్య రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. సిక్కిం, అస్సాం, మణిపుర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, మిజోరాం, నాగాల్యాండ్‌, మేఘాలయలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నారు. కొన్ని చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో కనీసం 34 మంది మరణించారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read Also : Gnanashekaran: అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసులో దోషికి 30 ఏళ్ల జైలు

Breaking News in Telugu Fatal accident in Sikkim.. Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Three security personnel killed Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.