ఫాస్టాగ్(FASTag) జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి లైట్ వెయిట్ వాహనాలకు ఇకపై ‘నో యువర్ వెహికల్’ (KYV) ప్రక్రియ అవసరం లేదని ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ఫాస్టాగ్ యాక్టివేషన్‌లో జరుగుతున్న ఆలస్యం గణనీయంగా తగ్గనుంది.
Read Also: VoiceOver WiFi: BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు
వాహనదారుల ఇబ్బందులకు పరిష్కారం
ఇప్పటి వరకు సరైన డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ KYV వెరిఫికేషన్ కారణంగా ఫాస్టాగ్(FASTag) యాక్టివేషన్‌కు ఎక్కువ సమయం పట్టేది. దీంతో హైవేలపై ప్రయాణించే వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదుర్కొనేవారు. తాజా నిర్ణయంతో ఈ సమస్యకు చెక్ పడుతుందని NHAI స్పష్టం చేసింది.
ఈ సడలింపు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ముఖ్యంగా కొత్తగా ఫాస్టాగ్ తీసుకునే వారికి ఇది ఎంతో ప్రయోజనకరం కానుంది. వేగవంతమైన యాక్టివేషన్‌తో పాటు డిజిటల్ టోల్ చెల్లింపులు మరింత సులభంగా మారనున్నాయి.
టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ తగ్గే అవకాశం
KYV ప్రక్రియ తొలగింపుతో ఫాస్టాగ్ జారీ వేగం పెరగనుంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాల నిలువు తగ్గి, ప్రయాణ సమయం ఆదా కానుంది. అలాగే క్యాష్ లెస్ లావాదేవీలను మరింత ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: