📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Fastag update : టోల్ బాదుడు షురూ, FASTag పాస్ ధర పెరిగింది

Author Icon By Sai Kiran
Updated: March 16, 2026 • 10:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Fastag update : సొంత వాహనాలతో నేషనల్ హైవేలపై నిత్యం ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరను పెంచుతున్నట్లు NHAI కీలక ప్రకటన చేసింది.

పెరిగిన ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రూ.3000గా ఉన్న వార్షిక పాస్ ధరను రూ.3075కు పెంచారు. అంటే ఇకపై వాహనదారులు మరో రూ.75 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ధరల సవరణ 2008 జాతీయ రహదారుల రుసుము నిబంధనల ప్రకారం జరిగినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వార్షిక పాస్ స్కీమ్ ఎలా పనిచేస్తుంది?

గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ వార్షిక పాస్ స్కీమ్ కేవలం కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ పాస్ ద్వారా ఒక సంవత్సరం కాలంలో లేదా 200 టోల్ క్రాసింగ్‌ల వరకు ప్రయాణించవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 56 లక్షల మంది వాహనదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద ఈ పాస్ చెల్లుబాటు అవుతుంది.

Read also: West Bengal Election Schedule 2026: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ.. ఆ రోజే ఫలితాలు!

Fastag update

ఆన్‌లైన్‌లో FASTag వార్షిక పాస్ ఎలా పొందాలి?

ఈ వార్షిక పాస్ పొందాలనుకునే వారు రాజ్‌మార్గ్ యాత్ర యాప్ లేదా NHAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసేటప్పుడు మీ వాహనం నంబర్, ఫాస్టాగ్ ఐడీతో లాగిన్ అయి నిర్దేశించిన రుసుమును UPI, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించాలి.

చెల్లింపు చేసిన రెండు గంటల్లోనే ఈ పాస్ మీ FASTag కు అనుసంధానం అవుతుంది. దీనికి సంబంధించిన సమాచారం SMS ద్వారా మీకు అందుతుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పాస్ తీసుకునే సమయానికి మీ FASTag యాక్టివ్‌గా ఉండాలి. తరచుగా ప్రయాణించే వారికి విడివిడిగా టోల్ చెల్లించడం కంటే ఈ వార్షిక పాస్ తీసుకోవడం వల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి.

Hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

fastag annual pass price 2026 fastag annual pass price hike fastag news india fastag toll pass india nhai fastag update toll price hike india

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.