Fastag update : సొంత వాహనాలతో నేషనల్ హైవేలపై నిత్యం ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరను పెంచుతున్నట్లు NHAI కీలక ప్రకటన చేసింది.
పెరిగిన ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రూ.3000గా ఉన్న వార్షిక పాస్ ధరను రూ.3075కు పెంచారు. అంటే ఇకపై వాహనదారులు మరో రూ.75 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ధరల సవరణ 2008 జాతీయ రహదారుల రుసుము నిబంధనల ప్రకారం జరిగినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వార్షిక పాస్ స్కీమ్ ఎలా పనిచేస్తుంది?
గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ వార్షిక పాస్ స్కీమ్ కేవలం కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంది.
ఈ పాస్ ద్వారా ఒక సంవత్సరం కాలంలో లేదా 200 టోల్ క్రాసింగ్‌ల వరకు ప్రయాణించవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 56 లక్షల మంది వాహనదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద ఈ పాస్ చెల్లుబాటు అవుతుంది.
Read also: West Bengal Election Schedule 2026: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ.. ఆ రోజే ఫలితాలు!

ఆన్‌లైన్‌లో FASTag వార్షిక పాస్ ఎలా పొందాలి?
ఈ వార్షిక పాస్ పొందాలనుకునే వారు రాజ్‌మార్గ్ యాత్ర యాప్ లేదా NHAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసేటప్పుడు మీ వాహనం నంబర్, ఫాస్టాగ్ ఐడీతో లాగిన్ అయి నిర్దేశించిన రుసుమును UPI, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించాలి.
చెల్లింపు చేసిన రెండు గంటల్లోనే ఈ పాస్ మీ FASTag కు అనుసంధానం అవుతుంది. దీనికి సంబంధించిన సమాచారం SMS ద్వారా మీకు అందుతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పాస్ తీసుకునే సమయానికి మీ FASTag యాక్టివ్‌గా ఉండాలి. తరచుగా ప్రయాణించే వారికి విడివిడిగా టోల్ చెల్లించడం కంటే ఈ వార్షిక పాస్ తీసుకోవడం వల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి.
Hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: