📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Farooq Abdullah: ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం

Author Icon By Saritha
Updated: March 12, 2026 • 11:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Farooq Abdullah: Assassination attempt on Farooq Abdullah

Farooq Abdullah: జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో బుధవారం ఒక్కసారిగా కలకలం రేగింది. మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాపై జమ్మూ శివార్లలో హత్యాయత్నం జరిగింది. ఆయనపై కాల్పులు జరిపేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

అసలేం జరిగింది?

జమ్మూ శివార్లలోని ఒక ప్రముఖ హోటల్‌లో బుధవారం జరిగిన వివాహ వేడుకకు ఫరూక్ అబ్దుల్లా హాజరు అయ్యారు. ఆయనతో పాటు జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ ఛౌదరి కూడా ఉన్నారు. అయితే వేడుకలో అందరితో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్న సమయంలో.. ఒక వ్యక్తి వెనుక నుంచి అకస్మాత్తుగా వచ్చి ఫరూక్ అబ్దుల్లాపై తుపాకీ గురిపెట్టాడు. నిందితుడు ట్రిగ్గర్ నొక్కేలోపే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులు అతడిని చుట్టుముట్టి కిందకు నెట్టేశారు. అనంతరం అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Read Also: Gas booking scam : గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు, పోలీసుల బిగ్ అలెర్ట్

భద్రతా వైఫల్యంపై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం

నిందితుడు జమ్మూకి చెందిన 63 ఏళ్ల కమల్ సింగ్ జమ్వాల్‌గా పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను గత 20 ఏళ్లుగా ఫరూక్ అబ్దుల్లాను చంపాలని ఎదురు చూస్తున్నట్లు నిందితుడు పోలీసులతో చెప్పాడు. ఇది తన వ్యక్తిగత అజెండా అని దీని వెనుక ఎలాంటి సంస్థల హస్తం లేదని పేర్కొన్నాడు. కాల్పులకు ప్రయత్నించిన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని, ఆ తుపాకీకి లైసెన్స్ కూడా ఉందని పోలీసులు ధృవీకరించారు.

ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. తన తండ్రికి జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ.. లోడ్ చేసిన తుపాకీతో ఒక వ్యక్తి అంత దగ్గరకు ఎలా రాగలిగాడు అని ఆయన ప్రశ్నించారు. ఇది స్పష్టమైన భద్రతా వైఫల్యమని ఆయన మండిపడ్డారు. డిప్యూటీ సీఎం సురీందర్ ఛౌదరి కూడా హోటల్ వద్ద భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

#telugu News Farooq Abdullah attack jammu kashmir Kamal Singh Jamwal Latest News in Telugu Omar Abdullah reaction on father's attack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.