పేద కుటుంబాలకు ఆపద వేళ ఆర్థిక సహాయం(Family Benefit Scheme) అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోంది. కుటుంబంలో ఆదారమైన వ్యక్తి మరణించినప్పుడు, ఆ కుటుంబం తీవ్ర మానసిక, ఆర్థిక సంక్షోభంలో పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో కనీసం కొంత ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.20 వేలు నుంచి రూ.40 వేలు వరకు ఆర్థిక సహాయం నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ముఖ్యంగా వితంతువు లేదా అవివాహిత కుమార్తె పేరు మీద ఈ సాయం అందజేస్తారు.
అర్హతలు
- కుటుంబానికి ప్రధాన ఆధారమైన వ్యక్తి 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సులో ఉండి అనుకోని ప్రమాదం వల్ల మరణించినప్పుడు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
- కుటుంబం బీపీఎల్ (పేదల జాబితా)లో ఉండాలి.
Read Also: Boat Trip: నాగార్జునసాగర్–శ్రీశైలం లాంచ్ ప్రయాణం పునఃప్రారంభం
దరఖాస్తు విధానం
అర్హులైన వారు అవసరమైన పత్రాలతో కలిసి తమ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తును సమర్పించాలి. తహసీల్దార్ పరిశీలన తర్వాత దరఖాస్తు సంబంధిత ఉన్నతాధికారులకు పంపబడుతుంది.
అవసరమైన పత్రాలు
- అప్లికేషన్ ఫారం
- తెల్ల రేషన్‌కార్డు
- ఆధార్ కార్డు
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- మరణ ధ్రువీకరణ పత్రం
- బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ జిరాక్స్
- సెల్ఫ్ అఫిడవిట్
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: