డిజిటల్ విప్లవం పెరిగిన తర్వాత ప్రతిదీ ఆన్‌లైన్‌లోకి మారిపోయింది. చివరికి ట్రాఫిక్ (Traffic) నిబంధనలు ఉల్లంఘిస్తే వచ్చే చలాన్లు కూడా మన ఫోన్‌కే వస్తున్నాయి. అయితే ఇదే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఒక ఆయుధంగా మారింది. హైదరాబాద్, పూణే వంటి నగరాల్లో వాహనదారుల భయాన్ని ఆసరాగా చేసుకుని ‘నకిలీ RTO ఇ-చలాన్’ స్కామ్ వేగంగా విస్తరిస్తోంది. చలాన్ కట్టకపోతే చట్టపరమైన చర్యలు తప్పవంటూ బెదిరిస్తూ పంపే ఈ మెసేజ్.. ఓపెన్ చేస్తే.. మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ అవ్వొచ్చు. ఈ స్కామ్ నుంచి ఎలా బయటపడాలంటే.. ఈ స్కామ్ ఎలా జరుగుతుంది? నేరగాళ్లు ప్రభుత్వ అధికారిక చలాన్ నోటీసును పోలిన మెసేజ్‌ను మీ మొబైల్‌కు పంపిస్తారు. అందులో మీరు సిగ్నల్ జంప్ చేశారని లేదా ఓవర్ స్పీడ్‌తో వెళ్లారని, వెంటనే చలాన్ కట్టాలని రాసి ఉంటుంది. ఆ మెసేజ్‌తో పాటు ఒక లింక్ లేదా ‘APK’ ఫైల్‌ను జత చేస్తారు. “త్వరగా కట్టకపోతే భారీ జరిమానా పడుతుంది” అని భయపెట్టడం వల్ల జనం కంగారులో ఆ లింక్‌ను క్లిక్ చేస్తారు. చలాన్ వివరాల కోసం ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయగానే.. మీ ఫోన్ రిమోట్ కంట్రోల్ సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుంది.
Read Also: Damaravancha village: ప్రమాణ స్వీకార ‘పంచాయితి’!
మీ గ్యాలరీ సమాచారం హ్యాకర్లకు చేరుతుంది
సైబర్ పోలీసుల దర్యాప్తులో తేలిందేమిటంటే.. నిందితులు వాట్సాప్‌లో ‘RTO Traffic Challan’ పేరుతో మాల్వేర్ ఫైళ్లను పంపిస్తున్నారు. మీరు ఆ ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయగానే, మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, మెసేజ్‌లు, బ్యాంక్ యాప్స్, మీ గ్యాలరీ సమాచారం హ్యాకర్లకు చేరుతుంది. నేరగాళ్లు మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు విత్ డ్రా చేసినప్పుడు వచ్చే OTPని మీకే తెలియకుండా వారు చదువుతారు. ఫలితంగా నిమిషాల్లో లక్షల రూపాయలు మాయమవుతాయి. వారాంతాల్లోనే దాడులు ఎందుకు? సైబర్ నేరగాళ్లు చాలా తెలివైనవారు. వారు తరచుగా శుక్రవారం సాయంత్రం లేదా బ్యాంకులకు సెలవు ఉన్న రోజుల్లోనే ఇలాంటి మెసేజ్‌లు పంపిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో బ్యాంక్ హెల్ప్‌లైన్ లేదా పోలీసుల నుండి తక్షణ సహాయం పొందడం కష్టమవుతుందని వారి ప్లాన్. పూణేలో ఒక వ్యక్తికి రూ. 5 లక్షలు, చించ్వాడ్‌లో మరో వ్యక్తికి రూ. 2.49 లక్షలు ఇలాగే మాయమయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: