📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Fake Aadhaar: ఏఐతో నకిలీ ఆధార్–పాన్: గుర్తింపు ధృవీకరణకు సవాల్

Author Icon By Pooja
Updated: November 26, 2025 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్, ముఖ్యంగా ఛాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, డీప్‌సీక్ వంటి అధునాతన సాంకేతికతలు ప్రపంచవ్యాప్తంగా విరివిగా అందుబాటులోకి వచ్చాయి. ఇవి సమాచార సేకరణ, పనులు సులభతరం చేయడంలో ఎంతగానో తోడ్పడుతున్నప్పటికీ, వాటి దుర్వినియోగం వల్ల ప్రమాదం కూడా పొంచి ఉంది. గతంలో డీప్‌సీక్ వంటి టూల్స్‌తో హీరోయిన్ల ఫొటోలు మార్ఫింగ్ చేయడంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తాజాగా, ఈ ప్రమాదం మరో కొత్త రూపంలో వెలుగులోకి వచ్చింది.

Read Also:  Artificial Intelligence : ఎఐ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు

Fake Aadhaar

కొంతమంది వీటిని మంచి పనుల కోసం ఉపయోగిస్తుండగా, మరికొందరు ఫేక్ వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లు క్రియేట్ చేసి తప్పుడు పనుల కోసం వాడుతున్నారు. ఈ క్రమంలో, ఏఐ సాయంతో నకిలీ ఆధార్ మరియు పాన్ కార్డులను కూడా తయారుచేసే అవకాశం ఉందనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.

‘నానో బనానా’ ఫీచర్ ద్వారా ఫేక్ ఐడీల సృష్టి

బెంగళూరుకు చెందిన హర్వీన్ సింగ్ చద్దా అనే టెక్కీ, గూగుల్ జెమినీ ప్లాట్‌ఫామ్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన ‘నానో బనానా’ అనే ఫీచర్‌ను ఉపయోగించి, అచ్చం ఒరిజినల్‌ను పోలిన ఫేక్ ఆధార్(Fake Aadhaar) మరియు పాన్ కార్డులను విజయవంతంగా సృష్టించాడు. ఈ ఫీచర్ వీడియోలు మరియు ఫొటోలు క్రియేట్ చేయడంలో ట్రెండ్ అవుతుండగా, ఇది ఎలాంటి అనుమానం రాకుండా, అత్యంత ఖచ్చితత్వంతో నకిలీ గుర్తింపు కార్డులను తయారు చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని చద్దా తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) అకౌంట్‌లో పేర్కొన్నాడు.

అతను ఉదాహరణల కోసం ఊహాజనిత వ్యక్తికి సంబంధించిన ఫేక్ పాన్, ఆధార్ కార్డుల(Fake Aadhaar) నమూనాలను షేర్ చేశాడు. ఈ నకిలీ కార్డుల డిజైన్‌ను, వాటిపై ఉన్న క్యూఆర్ కోడ్స్, పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలను చూస్తే, ఏది నిజమైనదో, ఏది నకిలీదో కనిపెట్టడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నానో బనానా ఫీచర్ ద్వారా ఎవరైనా సులభంగా ఫేక్ ఐడెంటిటీ కార్డులను సృష్టించుకోవచ్చని, ఇది గుర్తింపు కార్డుల ధృవీకరణ సమయంలో తీవ్రమైన ప్రమాదకరమని సర్వత్రా ఆందోళన నెలకొంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Fake PAN Card Google Gemini Google News in Telugu Latest News in Telugu Nano Banana Feature

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.