📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Prime Minister Modi: గాంధీ జయంతి రోజు అందరూ ఖాదీ వస్త్రాలను ధరించండి: పీఎం

Author Icon By Anusha
Updated: September 28, 2025 • 3:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ 126వ ఎపిసోడ్ (Mann Ki Baat Episode 126) లో దేశ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయన తరచుగా సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. తాజా ప్రసంగంలో ఆయన స్వదేశీ ఉత్పత్తుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించారు.

Sergey Lavrov: భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందా?

ముఖ్యంగా మహాత్మా గాంధీ జయంతి (Mahatma Gandhi’s Birthday) సందర్భంగా ప్రజలంతా ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేసి ధరించాలని, అలాగే దేశీయంగా తయారైన వస్తువులను వాడాలని పిలుపునిచ్చారు.మహాత్మా గాంధీ.. స్వాతంత్ర్య పోరాట సమయంలో స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కల్గే ఉపయోగాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారని,

భారతదేశం తన సొంత కాళ్లపై నిలబడాలని

దీని ద్వారా భారతదేశం తన సొంత కాళ్లపై నిలబడాలని గాంధీ కలలు కన్నారని ప్రధాని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితోనే.. “వికసిత భారత్” (Vikasith Bharat)లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలు దేశీయంగా తయారైన వస్తువులను కొనుగోలు చేయాలని కోరారు.గత 11 ఏళ్లలో భారతదేశంలో ఖాదీ పరిశ్రమ అద్భుతమైన ప్రగతిని సాధించిందని ప్రధాని మోదీ ప్రశంసించారు.

గతంలో కేవలం ప్రభుత్వ సహాయంతోనే మనుగడ సాగించిన ఈ పరిశ్రమ.. ఇప్పుడు స్వయం సమృద్ధితో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలలో ఖాదీ ఉత్పత్తి, అమ్మకాలు భారీగా పెరిగాయని, దీని ద్వారా వేలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి అవకాశాలు లభించాయని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని మోదీ తమ రాజకీయ విభేదాలను పక్కనబెట్టి

ఈ విజయం ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను నిరూపిస్తుందని ఆయన అన్నారు.ప్రధాని మోదీ తమ రాజకీయ విభేదాలను పక్కనబెట్టి.. కేవలం భారతీయులు తయారుచేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేసేలా దేశవ్యాప్తంగా ఒక విప్లవాన్ని ప్రారంభించాలని అన్ని రాజకీయ పార్టీలకు (political parties) విజ్ఞప్తి చేశారు.

Prime Minister Modi

రాజకీయాలకు అతీతంగా దేశం కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కేవలం అక్టోబర్ 2వ తేదీన మాత్రమే కాకుండా నిత్యం ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా దేశీయ పరిశ్రమలకు చేయూతనివ్వాలని ఆయన దేశ ప్రజలకు సూచించారు.

గణనీయమైన మార్పు వస్తుందని

ఈ చిన్నపాటి ప్రయత్నం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని.. ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు వస్తుందని ఆయన అన్నారు.ఈ ప్రసంగం ద్వారా ప్రధాని మోదీ (Prime Minister Modi) స్వదేశీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

అలాగే దేశ ప్రజలను స్వయం సమృద్ధిని ప్రోత్సహిస్తూ, భారత దేశాన్ని ఆర్థికంగా బలమైన దేశంగా మార్చాలన్న తన ప్రభుత్వ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు తమ తమ స్థానాల నుంచి ఈ మహా యజ్ఞంలో పాల్గొనాలని ఆయన కోరారు.

ఇది కేవలం ఆర్థిక ప్రయోజనాలకే పరిమితం కాకుండా ఒక దేశంగా మనందరిలో దేశభక్తిని, ఐక్యతను పెంపొందిస్తుందని ఆయన నొక్కి చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News buy khadi clothes gandhi jayanti 2025 khadi promotion latest news mann ki baat 126 episode narendra modi mann ki baat self reliant india swadeshi products india Telugu News vocal for local

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.