Evacuation of Indian: ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా పశ్చిమాసియా దేశాల్లో ఆందోళన చెందుతున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) తీపి కబురు అందించింది. గత మూడు రోజులుగా నిలిచిపోయిన విమాన రాకపోకలను మంగళవారం నుండి పాక్షికంగా పునరుద్ధరించారు. జెడ్డా, మస్కట్, అబుదాబి నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో, స్వదేశం కోసం ఎదురుచూస్తున్న ప్రవాసుల కుటుంబాల్లో ఆందోళన తగ్గింది.
గల్ఫ్‌లో చిక్కుకున్న పౌరులను సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు కేంద్ర విదేశాంగ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. బాధితుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Read Also: Middle East Conflict: ఖమేనీ మరణంపై భారత్ మౌనం? కారణం ఏంటి!
విమానాల వివరాలు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ విమానయాన సంస్థలు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి. ఇండిగో జెడ్డా నుంచి హైదరాబాద్, ముంబై, ఢిల్లీలకు 10 ప్రత్యేక విమానాలను కేటాయించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మస్కట్ నుంచి కొచ్చి, ఢిల్లీ, ముంబై నగరాలకు సర్వీసులను పునరుద్ధరించింది. ఎమిరేట్స్ & ఎతిహాద్ దుబాయ్, అబుదాబి నుంచి పరిమిత సంఖ్యలో విమానాలను నడుపుతున్నాయి. ఇప్పటికే కొన్ని విమానాలు ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి.
ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించడం వల్ల ప్రయాణ సమయం పెరగడంతో పాటు, ఇంధన ఖర్చులు అధికమై టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చే ముందే తమ ఫ్లైట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: