దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న వేళ, ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ కీలక నిర్ణయం తీసుకుంది. ముడిసరుకు ధరలు, ఎలక్ట్రిక్ పార్ట్స్ ఖర్చులు గణనీయంగా పెరగడంతో, తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ధరల పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
ఒక్కో స్కూటర్‌పై సుమారు రూ.3,000 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఏథర్ ఎనర్జీ స్కూటర్ల (Ather Energy) ధరలు రూ.1,14,000 నుండి రూ.1,82,000 వరకు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) కు పెరుగుతున్న డిమాండ్‌తో పాటు, ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Read Also: Handloom Exhibition: న్యూ ఇయర్ స్పెషల్: చేనేత వస్త్రాలపై భారీ డిస్కౌంట్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: