ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి శుభవార్త రానుంది. ప్రస్తుతం(EPFO) పరిధిలోకి ప్రతి నెల బేసిక్ వేతనం ₹15,000 లోపు ఉన్న ఉద్యోగులు, కార్మికులు మాత్రమే వస్తున్నారు. వీరికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) మరియు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) వర్తిస్తాయి.
Read Also: Cyber Security: ప్రపంచాన్ని కుదిపేసిన భారీ డేటా లీక్
తాజా సమాచారం ప్రకారం, ఈ వేతన పరిమితిని ₹15,000 నుంచి ₹25,000కు పెంచే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. వచ్చే EPFO సెంట్రల్ బోర్డు మీటింగ్‌లో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియా వెల్లడించింది. వేతన పరిమితి పెరిగితే, మరిన్ని ప్రైవేట్ ఉద్యోగులు EPF, EPS పరిధిలోకి వస్తారు. దీంతో వారికి భవిష్యత్ భద్రత, పెన్షన్ ప్రయోజనాలు విస్తరించే అవకాశం ఉంటుంది. ఇది కార్మికుల సామాజిక భద్రతా వ్యవస్థకు పెద్ద ఊతమని నిపుణులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: