ఝార్ఖండ్‌లో (Jharkhand) భారీ ఎన్‌కౌంటర్ – కోటి రివార్డున్న మావోయిస్టు నేత హతం ఝార్ఖండ్‌లో మావోయిస్టు కార్యకలాపాలపై భద్రతా బలగాలు దెబ్బదెబ్బలు కొడుతున్నాయి. హజారీబాగ్ జిల్లాలో జరిగిన ఆపరేషన్‌లో కోటి రూపాయల రివార్డు ఉన్న అగ్ర మావోయిస్టు నేత సహదేవ్ సోరెన్ సహా ముగ్గురు టాప్ కమాండర్లు మట్టుపడ్డారు. ఈ ఘట్టం రాష్ట్రంలో ఎర్రదళాల శక్తిని గణనీయంగా దెబ్బతీసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఆపరేషన్
సోమవారం ఉదయం హజారీబాగ్ జిల్లా గిర్హోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పానితిరి అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ (encounter) చోటుచేసుకుంది. సహదేవ్ సోరెన్ బృందం కదలికలపై గూఢచారి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని కోబ్రా కమాండోలు, సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా విస్తృతంగా కూంబింగ్ చేపట్టారు. దాంతో మావోయిస్టులు బలగాలపై కాల్పులు జరపగా, ప్రతిగా జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారు.
Encounter
మృతుల వివరాలు
సీఆర్పీఎఫ్ (CRPF) అధికారులు విడుదల చేసిన సమాచారం ప్రకారం, హతమైన వారిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ అలియాస్ ప్రవేశ్ (రివార్డు – ₹1 కోటి), స్పెషల్ ఏరియా కమిటీకి చెందిన రఘునాథ్ హేంబ్రామ్ (రివార్డు – ₹25 లక్షలు), జోనల్ కమిటీ సభ్యుడు వీర్సేన్ గంఝూ (రివార్డు – ₹10 లక్షలు) ఉన్నారు. వీరి వద్ద నుంచి మూడు ఏకే-47 రైఫిళ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ముఖ్యంగా, ఈ ఆపరేషన్‌లో భద్రతా సిబ్బందికి ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు.
రెండు రోజుల్లో రెండో విజయం
గత రెండు రోజులుగా మావోయిస్టులపై బలగాలు ఆపరేషన్లను మరింత వేగవంతం చేశాయి. ఆదివారం పలామూ జిల్లాలో నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో ₹5 లక్షల రివార్డున్న టీఎస్‌పీసీ మావోయిస్టు ముఖ్‌దేవ్ యాదవ్ హతమారిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా, హజారీబాగ్‌లో మరోసారి భద్రతా బలగాలు కీలక విజయాన్ని సాధించాయి.
మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ
ఝార్ఖండ్‌లో (Jharkhand) మావోయిస్టు వ్యూహాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ముఖ్యంగా సహదేవ్ సోరెన్ మరణం, ఎర్రదళాల కార్యకలాపాలను తీవ్రంగా బలహీనపరుస్తుందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్లు ఇంకా కొనసాగుతున్నాయని, మరికొంతమంది మావోయిస్టులు అక్కడే దాక్కున్న అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.
1: ఝార్ఖండ్‌లో ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగింది?
హజారీబాగ్ జిల్లా గిర్హోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పానితిరి అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
2: ఎప్పుడు ఈ ఆపరేషన్ ప్రారంభమైంది?
సోమవారం ఉదయం 6 గంటల సమయంలో కోబ్రా కమాండోలు, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: