📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Encounter: హిడ్మా, శంకర్ వి బూటకపు ఎన్ కౌంటర్లే

Author Icon By Sushmitha
Updated: December 5, 2025 • 10:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చర్ల: ఇటీవల మారేడుమిల్లి అటవీప్రాంత పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్లపై (Encounter) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, మీడియా ప్రతినిధి వికల్ప్ పేరిట ఒక సంచలన లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో, మావోయిస్టు (Maoist) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, పీఎల్జీఏ మొదటి బెటాలియన్ కమాండర్ మడివి హిడ్మాతో పాటు మరో ఐదుగురు, మరియు ఏవోబీ (AOB) స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు టెక్ శంకర్ ల మరణాలు ముమ్మాటికీ హత్యలేనని వికల్ప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Putin visit Delhi traffic : పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

వికల్ప్ లేఖ ప్రకారం, ఈ రెండు ఎన్‌కౌంటర్లలో మొత్తం 13 మందిని ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపించారు. అంతేకాకుండా, మరో 50 మందిని అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు.

Encounter Hidma, Shankar V fake encounter

ఎన్‌కౌంటర్లకు దళం నుండి పారిపోయిన కోసాల్ సభ్యుడే కారణం

ఈ రెండు బూటకపు ఎన్‌కౌంటర్లకు విజయవాడకు (Vijayawada) చెందిన కలప వ్యాపారి వద్దకు దళం నుండి పారిపోయిన కోసాల్ అనే సభ్యుడు ఇచ్చిన సమాచారమే కారణమని మావోయిస్టులు లేఖలో తెలిపారు.

ఈ రెండు ఎన్‌కౌంటర్లపై వెంటనే న్యాయవిచారణ చేపట్టాలని, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పలు దఫాలుగా జరిగిన హత్యలపై కూడా వెంటనే న్యాయవిచారణ జరిపించాలని కోరారు.

ప్రజా ఉద్యమాలకు పిలుపు, న్యాయ సాయం కోసం విజ్ఞప్తి

అదేవిధంగా, ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే ఆపాలని వికల్ప్ డిమాండ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

అరెస్ట్ అయిన 50 మంది మావోయిస్టులకు న్యాయ సాయం అందించాలని, వారి విడుదలకు కృషి చేయాలని ప్రజాపక్ష న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AndhraOdishaBorder FakeEncounters Google News in Telugu Latest News in Telugu MaoistAllegations MaoistLeaderHidma MaredumilliForest OperationKagaar TechShankar Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.