📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Elvish Yadav: పాము విషం కేసు.. యూట్యూబర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Author Icon By Anusha
Updated: February 19, 2026 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Elvish Yadav: వినోదం కోసం పాములను ఉపయోగించే ఘటనలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూట్యూబర్, బిగ్‌బాస్ విజేత ఎల్విష్ యాదవ్ తనపై నమోదైన కేసులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పాములతో ఆటలాడటం నేరమా కాదా అని ప్రశ్నిస్తూ, సెలబ్రిటీలు ఇలాంటి పనులు చేస్తే సమాజానికి తప్పు సందేశం వెళ్తుందని హెచ్చరించింది.

Read Also: EAPCET 2026 : ఎప్‌సెట్‌లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!

అసలు పాము విషాన్ని ఎలా సేకరిస్తారు? రేవ్ పార్టీల్లో దానిని వినోదం కోసం ఎలా ఉపయోగిస్తారు? అసలు భయం లేకుండా వాటిని ఎలా పట్టుకుంటారు? అనే విషయాలను వివరించాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. గతంలో ట్రయల్ కోర్టులో ఎల్విష్‌పై జరుగుతున్న విచారణపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే.

Elvish Yadav: Snake venom case.. Supreme Court angry with YouTuber

కేసు ఏమిటి?

2023 నవంబర్‌లో నోయిడాలో జరిగిన ఒక రేవ్ పార్టీలో పాము విషాన్ని మత్తు కోసం వాడారనే ఆరోపణలపై ఎల్విష్ యాదవ్‌పై కేసు నమోదు అయింది. ఈ కేసులో 2024 మార్చి 17న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛార్జిషీటులో విదేశీయులు కూడా ఈ పార్టీల్లో పాల్గొని పాము విషాన్ని మత్తు కోసం వాడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

BiggBoss ElvishYadav latest news SupremeCourt Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.