దేశంలో విద్యుత్ ఉత్పత్తి రంగం (Power generation sector) లో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వనరుల నుంచి కలిపి విద్యుదుత్పత్తి తొలిసారిగా 500 గిగావాట్లను దాటింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉత్పత్తిగా కేంద్రం ప్రకటించింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, 2014 మార్చి 31 నాటికి దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 249 గిగావాట్లుగా ఉండేది.
Read Also: America: EAD ఆటోమేటిక్ పొడిగింపు రద్దు చేసిన అమెరికా
అప్పటి నుంచి గడిచిన పదేళ్లలో ఆ సామర్థ్యం దాదాపు రెట్టింపు అయింది. 2025 సెప్టెంబర్ 30 నాటికి దేశం మొత్తం 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంది. ఇది భారత విద్యుత్ రంగం (Electricity sector) అభివృద్ధిలో కీలకమైన మైలురాయిగా భావిస్తున్నారు.ఇందులో జల, అణు, సౌర, పవన విద్యుత్ వాటా 256 గిగావాట్లు, శిలాజ వనరుల వాటా 244.80 గిగావాట్లుగా ఉందని వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: