📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Election Results: రేపే ఎన్నికల ఫలితాలు..ఐదు రాష్ట్రాల్లో ఎవరిది పైచేయి?

Author Icon By Pooja
Updated: May 3, 2026 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Election Results: దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న ఐదు రాష్ట్రాల (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. రేపు (మే 4, సోమవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Read Also:Assembly Election Results 2026:రేపే ఓట్ల లెక్కింపు.. ఐదు రాష్ట్రాల భవితవ్యం తేలేది అప్పుడే!

ఫలితాల కంటే ముందే బెట్టింగ్ జోరు

ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ ఒకవైపు ఉంటే, బెట్టింగ్ బంగార్రాజుల హడావుడి మరోవైపు కనిపిస్తోంది.

కౌంటింగ్ ప్రక్రియ ఇలా..

ఎన్నికల సంఘం (EC) నిబంధనల ప్రకారం లెక్కింపు సాగనుంది:

  1. ఉదయం 8:00: మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.
  2. ఉదయం 8:30: ఈవీఎం (EVM) లెక్కింపు ప్రారంభమవుతుంది.
  3. తొలి ట్రెండ్స్: ఉదయం 10 గంటల కల్లా ఏ పార్టీ ముందంజలో ఉందో ప్రాథమిక అవగాహన రానుంది.
  4. తుది ఫలితం: మధ్యాహ్నం లేదా సాయంత్రం కల్లా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

Election Results: రాష్ట్రాల వారీగా తాజా పరిస్థితి:

ఎన్నికల టాప్ 9 ముఖ్యాంశాలు:

  1. సుప్రీంకోర్టు తీర్పు: కౌంటింగ్ అధికారుల నియామకంపై టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
  2. భద్రత: బెంగాల్‌లో కౌంటింగ్ కోసం అదనంగా 165 మంది పరిశీలకులను ఈసీ నియమించింది.
  3. ఏర్పాట్లు పూర్తి: సోమవారం ఉదయం 8 గంటలకు లెక్కింపునకు అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
  4. దీదీ ధీమా: తమ పార్టీ 200లకు పైగా సీట్లు సాధిస్తుందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
  5. రిపోలింగ్: బెంగాల్‌లోని 15 పోలింగ్ స్టేషన్లలో ఎండలను లెక్కచేయకుండా ఓటర్లు భారీగా ఓటు వేశారు.
  6. ఆందోళనలు: బెంగాల్‌లో టీఎంసీ నేతలు బెదిరిస్తున్నారంటూ స్థానికులు రీపోలింగ్ సమయంలో నిరసన వ్యక్తం చేశారు.
  7. అస్సాం ఆరోపణలు: స్ట్రాంగ్ రూమ్స్ నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని అస్సాం పీసీసీ చీఫ్ గౌరవ్ గొగోయ్ ఆరోపించారు.
  8. డీకే శివకుమార్ రంగ ప్రవేశం: తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గౌహతి చేరుకున్నారు.
  9. TVK ఫిర్యాదు: తమిళనాడులో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత పెంచాలని మరియు తమ పార్టీ కార్యాలయంపై దాడిపై విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ఫిర్యాదు చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

BJP Counting Updates. DMK Donald Trump Election Results 2026 Election Results LIVE Mamata Banerjee tamil nadu elections TMC Vijay TVK West Bengal Results

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.