📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Election Commission: ఓటర్ ఐడీ కార్డుల జారీపై కేంద్ర ఎన్నికల సంఘం కొత్త రూల్స్

Author Icon By Sharanya
Updated: June 19, 2025 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఓటర్లకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు కీలక సంస్కరణలు చేపట్టింది. ఇప్పటి వరకు ఓటర్ ఐడీ (Voter ID) కార్డు పొందేందుకు దరఖాస్తు చేసిన తర్వాత కనీసం ఒక నెల నుంచి రెండు నెలల వరకు వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఈ ఆలస్యం ఓటర్లను అసంతృప్తికి గురిచేసేది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ ఐడీ ప్రధాన పత్రం కావడంతో, ఈ పత్రాన్ని త్వరితగతిన ప్రజలకు అందించేందుకు తాజా నిర్ణయం తీసుకుంది.

ఓటర్లకు 15 రోజుల్లో కార్డు:

కొత్త ఓటర్ల నమోదుకు గానీ, ఇప్పటికే ఉన్న ఓటర్ కార్డులో వివరాలను సరిచేసుకునేందుకు గానీ దరఖాస్తు చేసినవారికి కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఓటర్ ఐడీ కార్డు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొత్త కార్డు లేదా మార్పులు చేర్పులు చేసిన కార్డు పొందడానికి నెల రోజులకు పైగా సమయం పడుతుండగా, ఈ నూతన విధానంతో ఆ జాప్యం తగ్గనుంది.

రియల్ టైమ్ ట్రాకింగ్, ఎస్ఎంఎస్ అప్డేట్స్:

ఈ కొత్త విధానం ప్రకారం ఓటర్ ఐడీ తయారీ నుండి డెలివరీ వరకు రకు ప్రతి దశను రియల్ టైమ్ ట్రాకింగ్ (Real-time tracking)ద్వారా పర్యవేక్షించనున్నారు. కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న వారికి, అలాగే తమ ఓటర్ కార్డులోని వివరాలలో మార్పులు కోరిన వారికి ఇది వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కార్డు తయారీ నుంచి ఓటరు చేతికి అందే వరకు ప్రతి దశను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌ఓ) స్థాయి నుంచి పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేసేంత వరకు రియల్-టైమ్ ట్రాకింగ్ చేయనున్నట్లు పోల్ అథారిటీ తెలిపింది. అంతేకాకుండా, కార్డు ప్రస్తుత స్థితిని ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా ఓటర్లకు తెలియజేయనున్నారు.

త్వరలో జరిగే ఎన్నికల నేపథ్యం:

ఈ నిర్ణయం వెనుక మరో ముఖ్యమైన కారణం బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలాగే, వచ్చే ఏడాది తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లకు సత్వర సేవలు అందించేందుకు ఎన్నికల సంఘం ఈ దిశగా కసరత్తు చేపట్టింది. . ఇదే సమయంలో యువ ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతుండటంతో, వీరికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరింత వేగవంతమైన సేవలు అందించాలనే దిశగా ఈ చర్యలు చేపట్టారు.

Read also: Visa: అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు ప్రారంభం

#ECIInitiative #ECINews #ElectionCommission #NewRules #VoterCardUpdate #VoterID #VoterIDIn15Days Breaking News in Telugu Breaking News Telugu Current News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu Web Stories in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.