📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Election Commission: ఓట్ చోరీ ఆరోపణలతో ముదురుతున్న వివాదం

Author Icon By Anusha
Updated: August 18, 2025 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఓట్ చోరీ విషయంలో ఎలక్షన్ కమిషన్, ఇండియా కూటమిల మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతున్నది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి వారం రోజులు గడువుతో,ఈసీ జ్ఞానేశ్ కుమార్ అల్టిమేటం జారీ చేయడంపై ఇండియా కూటమి భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో సీఈసీని తొలగించాలని పార్లమెంట్ లో,తీర్మాణం ప్రవేశపెట్టేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సీఈసీని పదవిలో నుంచి తొలగించాలంటే సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిని తొలగించే పద్ధతే పాటించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. మూడింట మూడోవంతు సభ్యుల మెజారిటీతో పార్లమెంట్ తీర్మానం పాస్ చేయాల్సి ఉంటుంది. మిస్ బిహేవియర్ లేదా సదరు బాధ్యతల నిర్వహణకు అర్హత లేదని నిరూపణ అయితే సీ ఈసీని పదవి నుంచి తొలగించవచ్చు.

తీవ్ర వివాదం రేపుతున్న రాహుల్ గాంధీ ఆరోపణలు

కాగా ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని, అధికార ఎన్డీయే కూటమి ఓట్ల చోరీకి ఎలక్షన్ కమిషన్ సహకరిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు తీవ్ర వివాదం రేపాయి. ఈ ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ (Election Commission) ప్రత్యేకంగా ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఓట్ చోరీ అనే పదం ఉపయోగించడంపై తీవ్ర అభ్యంరం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనని విమర్శించింది. ఎన్నికల జాబితాలో అవకతవకలు,జరిగాయంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించడంతో పాటు డిక్లేరేషన్ ఇవ్వాలని రాహుల్ ను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇందుకు ఏడు రోజులు గడువు ఇస్తూ ఆలోగా డిక్లరేషన్ ఇవ్వకుంటే తన ఆరోపణలు తప్పని ఒప్పుకుంటూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహుల్
గాంధీకి అల్టిమేటం జారీ చేశారు.

Election Commission

రెండుగా విడిపోయిన మీడియా

కాగా రాహుల్ గాంధీ ఈసీపై ఆరోపణ చేయడంతో మీడియా రెండుగా విడిపోయింది. ఈసీని, బీజేపీని సమర్థించే మీడియా సంస్థలు కొన్ని అయితే రాహుల్ గాంధీకి సపోర్టు చేస్తున్న సంస్థలు ఉన్నాయి. ఇందులో సీఈసీ ఆరోపణలు వింతగా ఉన్నాయి. ఓట్ చోరీ జరిగిందని ఎవరైనా ఆరోపణలు చేస్తే దానిపై విచారించాలి. అందులో నిజానిజాలు ఎంతో చూడాలి. అవసరమైతే కమిటీని వేసి, దానికనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఇవేవీ లేకుండా అసలుమేం విచారణ చేయడం, అఫిడవిట్ డిక్లేరేషన్ ఇస్తేనే విచారణ చేస్తామని అనడం విడ్డూరంగా ఉంది.

రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి ఎప్పుడు ప్రవేశించారు?

2004లో అమేథీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు.

రాహుల్ గాంధీ ఏ ఏ పదవులు చేపట్టారు?

ఆయన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా, తరువాత పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు.

    Read more: hindi.vaartha.com

    Read Also:

    https://vaartha.com/mumbai-rains-orange-alert-heavy-rainfall-update/national/531908/

    Breaking News ec ultimatum Election Commission India alliance Indian Politics latest news parliament resolution rahul gandhi vote theft issue

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.