IPAC కోఫౌండర్ ప్రతీక్ జైన్ ఇంటి నుంచి తమ పార్టీకి సంబంధించిన కీలక డాక్యుమెంట్స్‌ను ఈడీ స్వాధీనం చేసుకుందని పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. కోల్‌కతాలోని ప్రతీక్ జైన్ నివాసంపై ఇవాళ ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. మమత బెనర్జీ స్వయంగా ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. మమత ఆయన ఇంటికి వెళ్లిన సందర్భంలో కామెంట్లు చేశారు. తమ పార్టీ అభ్యర్థుల వివరాలు ఉన్న ఫైల్స్‌ను ఈడీ అధికారులు తీసుకెళ్లారని మండిపడ్డారు.
Read Also: Microsoft Layoffs: జనవరిలో భారీగా తొలగింపులు నిజమేనా?
మాటల యుద్ధం
అనంతరం సాల్ట్ లేక్‌లోని ఐ-ప్యాక్ కార్యాలయానికి కూడా వెళతానని ఆమె తెలిపారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే 2020 నుంచి ఐ-ప్యాక్ సంస్థ తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.మమత చర్యలపై పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ విధుల్లో మమతా బెనర్జీ నేరుగా జోక్యం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
“గతంలో కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినప్పుడు కూడా ఆమె ఇదే విధంగా అడ్డుకున్నారు. సీబీఐకి వ్యతిరేకంగా నగరంలో ధర్నాకు దిగారు. ఇప్పుడు కూడా అదే పునరావృతం చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ కార్యాలయంపై ఈడీ దాడి చేస్తే ఆమెకెందుకు అంత ఆందోళన?” అని సువేందు అధికారి ప్రశ్నించారు. ఈ ఘటనతో బెంగాల్‌లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: