📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Anil Ambani : అనిల్‌ అంబానీ కంపెనీలకు రుణాలు ఇచ్చిన బ్యాంకులకు ఈడీ లేఖ

Author Icon By Sudha
Updated: August 4, 2025 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్‌ ఛైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చర్యలు ముమ్మరం చేసింది. బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో ఆయనపై ఈడీ పలు ఆధారాలు సేకరిస్తోంది. ఇప్పటికే ఆయనను ఆగస్టు 5న విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. దీనికితోడు, దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకోవడానికి ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీచేసింది. తాజాగా ఈ కేసులో కీలక మలుపుగా, అనిల్ అంబానీకి ( Anil Ambani)చెందిన కంపెనీలకు గతంలో రుణాలు ఇచ్చిన బ్యాంకులకు ఈడీ లేఖలు పంపింది. బ్యాంకుల నుంచి పూర్తి రుణ వివరాలు, వాటి వినియోగం, చెల్లింపుల్లో జరిగిన దొంగదెబ్బలపై సమాచారం కోరింది. కొన్ని బ్యాంకులు ఇప్పటికే ఈడీకి వివరాలు పంపినట్టు తెలుస్తోంది.

Anil Ambani : అనిల్‌ అంబానీ కంపెనీలకు రుణాలు ఇచ్చిన బ్యాంకులకు ఈడీ లేఖ

రిలయన్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌కు రుణాలు ఇచ్చిన 12-13 ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు ఈడీ తాజాగా లేఖలు రాసింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యూకో, పంజాబ్‌, సింద్‌ బ్యాంక్‌ల నుంచి రుణాల ఎగవేతకు సంబంధించిన వివరాలను తమకు ఇవ్వాలని కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ రుణాలకు సంబంధించి కొంత మంది బ్యాంకు అధికారులను కూడా ఈడీ పశ్నించే అవకాశం ఉందని తెలిసింది. కాగా, 2017 నుంచి 2019 వరకు ఎస్‌ బ్యాంక్‌ నుంచి తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. గ్రూపు కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంక్‌ ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు గుర్తించారు.

రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్‌ రుణ వితరణ ఆ మరుసటి ఏడాదికిగాను రూ.8,670 కోట్లకు పెరిగింది. రుణ ఎగవేతకు సంబంధించి అనిల్‌ అంబానీకి ( Anil Ambani)సంబంధించిన కంపెనీలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్‌ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన దర్యాప్తు అధికారులు.. అనిల్‌ అంబానీకి సమన్లు పంపారు. ఈ నెల 5న న్యూఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో చారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈడీ విచారణ నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా ఉండేందుకు లుకౌట్‌ నోటీసులు కూడా జారీ చేసింది.

అనిల్ అంబానీ బిజినెస్?

ఆయన రిలయన్స్ గ్రూప్ కు ఛైర్మన్ ; ఇందులో రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్, రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్, రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ మరియు రిలయన్స్ డిఫెన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి.

రిలయన్స్ సీఈఓ జీతం ఎంత?

రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో CEO కి సంవత్సరానికి అంచనా వేసిన మొత్తం వేతన పరిధి ₹28.5 లక్షలు–₹31.5 లక్షలు , ఇందులో మూల జీతం మరియు అదనపు వేతనం కూడా ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో సగటు CEO మూల జీతం సంవత్సరానికి ₹29.9 లక్షలు.

CEO జీతం ఎందుకు ఎక్కువగా ఉంటుంది?

లిస్టెడ్ కంపెనీలలో మార్కెట్ క్యాపిటలైజేషన్ CEO పరిహారాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది . బోర్డులు ఎగ్జిక్యూటివ్ వేతనాన్ని మొత్తం వాటాదారుల రాబడి, స్టాక్ ధర పనితీరు మరియు మార్కెట్ క్యాపిటలైజేషన్ వృద్ధికి అనుసంధానిస్తాయి. ₹50,000 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్‌లు ఉన్న కంపెనీలు తరచుగా ప్రీమియం పరిహార ప్యాకేజీలను అందిస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: DK Shivakumar: సీఎం సిద్ధరామయ్య పై పరోక్ష వ్యాఖ్యలు

anil ambani Breaking News ED investigation Enforcement Directorate Indian Banks latest news Loan Fraud Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.